రాష్ట్రీయం

మాజీ ఎంపీ వివేక్‌తో బీజేపీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాజీ ఎంపీ జీ వివేక్ బీజేపీ గూటికి చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి లోక్‌సభ టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే తన రాజకీయ భవితవ్యాన్ని ప్రకటిస్తానని ఆయన ఆదివారం నాడు అనుచరులకు చెప్పారు. ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని కొంతమంది, బీజేపీలో చేరుతారని మరికొంత మంది చెప్పడంతో పాటు సోమవారం నా డు నామినేషన్లకు ఆఖరు రోజు కావడంతో రాజకీయం వేడెక్కింది. పెద్దపల్లి నియోజకవర్గానికి ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఎస్ కుమార్‌ను ప్రకటించారు. ఒక వేళ వివేకానంద బీజేపీలో చేరితే పెద్దపల్లికి ఆయననే అభ్యర్ధిగా ప్రకటించి ఎస్. కుమార్‌ను తప్పించవచ్చని పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత చెప్పారు. తండ్రి జీ వేంకటస్వామి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన నేపథ్యంలో ఒక పక్క ఆ పార్టీ నేతలు కూడా వివేక్‌తో చర్చలు జరిపినట్టు తెలిసింది. మరో పక్క బీజే పీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సైతం వివేకానంద తో చర్చలు జరిపారని, ఈ క్రమంలోనే వివేకానంద ఢి ల్లీ వెళ్లారని చెబుతున్నారు. ఆదివారం రాత్రి బీజేపీ అగ్రనేతలను కలుసుకునే అవకాశం ఉందని తెలిసింది. అదే జరిగితే సోమవారం నాడు ఆయన వెనక్కు వచ్చి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఈ కారణంగానే ఎస్ కుమార్‌కు బీ ఫారం ఇవ్వకుండా ఆపారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంబీబీఎస్ చేసిన వివేకానంద 15దేశాలు పర్యటించారు. 2009 నుండి 14 వరకూ పెద్దపల్లి నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన తర్వాత అక్కడి నుండి బాల్కసుమన్ గెలుపొందారు.ఈసారి తనకే టీఆర్‌ఎస్ నుండి టిక్కెట్ వస్తుందని భావించిన వివేకాకు నిరాశ ఎదురు కావడంతో టీఆర్‌ఎస్ తీరుపై తీవ్ర విమర్శలకు దిగడమేగాక, తన బానిస సంకెళ్లు తెగాయని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో అనుయాయులతో విస్తృత చర్చలు జరిపిన ఆయన హైదరాబాద్ వచ్చి కొంత మంది నేతలను కలుసుకున్నారు. అనంతరం ఆయన ఢిల్లీకి పయనమయ్యారని సమాచారం.