రాష్ట్రీయం

నక్సలిజాన్ని మట్టుబెట్టాం .. తీవ్రవాదాన్ని తిప్పికొట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: దేశంలో నక్సలిజాన్ని మట్టుబెట్టామని, తీవ్రవాదాన్ని తిప్పికొట్టామని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె హైదరాబాద్‌లో జరిగిన నాలుగు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సైనిక్‌పురిలోని హెచ్‌ఎంటీ బేరింగ్స్ కమ్యూనిటీ హాల్ జరిగిన మాజీ సైనికులు, మేథావుల సదస్సులోనూ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీల యాజమాన్య సదస్సులోనూ, సాయం త్రం మాదాపూర్‌లోని ఖానాపేట్‌లోని సైబర్ టవర్స్ బుట్టా కనె్వన్షన్‌లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇటీవల మరణించిన బద్దం బాల్‌రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. చాలాకాలం తర్వాత తాను పార్టీ కార్యాలయానికి వచ్చానని ఆమె వ్యాఖ్యానించారు. 2014లో నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా పెనుమార్పులు వచ్చాయని అన్నారు. తొలిసారి నాన్ కాంగ్రెస్, సంకీర్ణం ఉన్నా, ఏకైక పార్టీకి పూర్తి మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి అన్ని రంగాల్లో దేశంలో నిరాశ, నిస్పృహ పరిస్థితులు నెలకొన్నాయని, భారత్ ముందుకు వచ్చే అవకాశం లేదని విదేశాల్లో చర్చ జరిగేదని అన్నారు. ఏ రకమైన ముందు ఆలోచన లేకుండా అన్ని వ్యవస్థలనూ కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని, ఆ పరిస్థితుల నుండి దేశాన్ని చక్కదిద్దడం తలకుమించిన భారం అయిందని అన్నారు. దేశంలో పప్పు్ధన్యాలు 23 లక్షల టన్నులు అవసరమైతే కేవలం 15-16లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయ్యాయని, మిగిలిన మొత్తాన్ని విదేశాల నుండి అత్యవసరంగా దిగుమతి చేసుకోవలసి వచ్చిందని అన్నారు. నేడు దేశానికి కావల్సిన మొత్తంలో ఉత్పత్తి చేయడమేగాక, ఇతరులకు ఎగుమతి చేసే సామర్ధ్యానికి వచ్చామని అన్నారు. ఏ సమస్యనూ ఈ రోజు తీరితే చాలు అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయలేదని, ఎప్పటికీ అలాంటి సమస్య ఎదురుకాకూడదనే ఆలోచనతో పనిచేస్తోందని అన్నారు. ప్రతి అంశంపైనా ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ప్రణాళిక వేసి దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. రైతాంగ సమస్యలైనా, కార్మిక సమస్యలైనా, మహిళా సమస్యలైనా, పేదవారి సమస్యలైనా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. దేశంలో 22 పంటలకు నేడు ఎంఎస్‌పీ అందిస్తున్నామని అన్నారు. అలాగే ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తున్నామని, 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. అసంఘటిత రంగాల కార్మికులకూ వైద్య సదుపాయం, పెన్షన్ సదుపాయం కోసం ప్రధాని యోచిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా మూడు అంశాలపై చర్చ జరగాలని ఆమె పేర్కొంటూ దానిని త్రీడీగా వివరించారు. డీ- డిఫెన్స్, డీ-డెవలప్‌మెంట్, డీ- డైనాస్టీయేతర అంటే రాచరికానికి ముగింపు పలకాలని అన్నారు. ఈ సందర్భంగా ఆమె డిఫెన్స్, డెవలప్‌మెంట్, డైనాస్టీ పదాలను నిర్వచించారు. డిఫెన్స్ అంటే కేవలం విదేశాల్లో రక్షణ రంగం మాత్రమే కాదని, దేశీయంగా అంతర్గత భద్రత, రక్షణ విషయంలోనూ కేంద్రప్రభుత్వం ఎంతో సమర్ధంగా వ్యవహరించిందని చెప్పారు. దేశం కోసం మాత్రమే పనిచేస్తున్న స్వార్ధం లేని నాయకుడు నరేంద్రమోదీ మాత్రమేనని, ఓటు వేస్తున్నపుడు ఈ విషయాలు అన్నింటినీ ఆలోచించాలని ఓటర్లను చైతన్య పరచాలని నిర్మల చెప్పారు. అందరూ ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని ఆమె సూచించారు.

చిత్రం.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బీజేపీ విస్తృత స్థాయ కార్యకర్తల సమావేశంలో నిర్మలా సీతారామన్