రాష్ట్రీయం

నాడు.. నేడు అది ‘విజయ’వాడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ రాజధాని అయినప్పటికీ నాటినుంచి నేటివరకు కూడా విజయవాడ రాజకీయ రాజధానిగా పేరొందింది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని అమరావతి అయినప్పటికీ రాజధానిగా విజయవాడ నగరం పేరునే చెప్పుకుంటున్నారు. ఈ నియోజకవర్గ వాసుల్లో అత్యధికలు విద్యావంతులు, రైతులు అయినప్పటికీ స్థానికేతరులకు అలాగే మహిళలకు పట్టంగట్టిన చరిత్ర విజయవాడ సొంతం. కారణాలేమైనా చెన్నుపాటి విద్య అనంతరం దాదాపు 1994 నుంచి గత 25 ఏళ్లుగా మహిళలకు ప్రాతినిథ్యం మాత్రం లేదు. ప్రధాన రాజకీయ పక్షాలేవీ మహిళలకు సీట్లు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ నియోజకవర్గం నుంచి ఒక్క కేఎల్ రావు మినహా మరెవరికీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం దొరకని విషయం గమనార్హం. ఇక 1952లో తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహోన్నత వ్యక్తి హరిశ్చంద్ర ఛటోపాధ్యాయ ఇండిపెండెంట్‌గా గెలిచారు. నాడు సీపీఐ బలపర్చింది. అదే సమయంలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన స్థానిక అనె్న అంజయ్య కుమార్తె రాజ్యం సిన్హా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఈమె భర్త విజయ్‌కుమార్ సిన్హా అండమాన్ జైల్లో ఉండగా బ్రిటిష్‌వారు కాలు తీసేశారు. 1957లో కే.అచ్చెమాంబ కాంగ్రెస్ తరపున గెలిచారు. 1962, 1967, 1971 ఎన్నికల్లో వరుసగా మూడు దఫాలు ఆమె మేనల్లుడు, ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆసక్తికర అంశం ఏమిటంటే ఆయన 1967లో ఏకగ్రీవంగా గెలిచారు. ఆయన ఎంతటి మహోన్నత ఇంజనీర్ అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి జనతాలోకి వలస వెళ్లడంతో 1977, 1980 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓటమిపాలయ్యారు. 1977లో మూడో స్థానంలోకి వెళ్లారు. 1977లో దేశ వ్యాప్తంగా జనతా ప్రభంజనం ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోడే మురహరి కాంగ్రెస్ తరపున గెలిచి లోక్‌సభలో ఉపసభాపతిగా కూడా పని చేశారు. 1980లో కేఎల్ రావుపై గెలుపొందిన చెన్నుపాటి విద్య 1984 ఎన్నికల్లో స్థానికేతరుడు, ఉయ్యూరు ప్రాంతం యలమర్రు గ్రామానికి చెందిన వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతిలో ఓటమిపాలైనా తిరిగి 1989 ఎన్నికల్లో ఆయనపైనే గెలుపొంది, 1991 ఎన్నికల్లో మళ్లీ మరోసారి వడ్డేశోభనాద్రీశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఏలూరు ప్రాంతానికి చెందిన పర్వతనేని ఉపేంద్ర 1996లో వడ్డే శోభనాద్రీశ్వరరావుపైన, తిరిగి రెండోసారి 1998 ఎన్నికల్లో స్థానికేతరుడైన దాసరి జైరమేష్ పైన గెలుపొంది, 1999 ఎన్నికల్లో స్థానికేతరుడైన గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమిపాలయ్యారు. జై రమేష్, గద్దె రామ్మోహన్ ఇరువురు కూడా గన్నవరం ప్రాంతానికి చెందినవారు. 2004 ఎన్నికల్లో నెల్లూరు ప్రాంతానికి చెందిన లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ తరపున సినీ నిర్మాత అశ్వనీదత్‌పైన, రెండోసారి 2009 ఎన్నికల్లో గన్నవరం ప్రాంతానికి చెందిన వల్లభనేని వంశీపై గెలుపొంది గత ఎన్నికల్లో పోటీకి దూరంగా నిలిచారు. గత ఎన్నికల్లో కేశినేని శ్రీనివాస్ (నాని) వైకాపా అభ్యర్థి కోనేరు ప్రసాద్‌పై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అడ్రస్ లేకుండా పోయారు.
*
సం. విజేత పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ
1952 హరిశ్చంద్ర ఛటోపాధ్యాయ ఇండిపెండెంట్ రాజ్యం నిన్హా కాంగ్రెస్
1957 కే అచ్చెమాంబ కాంగ్రెస్ తమ్మినపోతురాజు సీపీఐ
1962 కేఎల్ రావు కాంగ్రెస్ ఎన్‌డీఎం ప్రసాదరావు కాంగ్రెస్
1967 కేఎల్‌రావు కాంగ్రెస్ ఏకగ్రీవం
1971 కేఎల్‌రావు కాంగ్రెస్ దాసరి నాగభూషణరావు సీపీఐ
1977 గోడే మురహరి కాంగ్రెస్ జి మురళీమోహన్ బీఎల్‌డీ
1980 చెన్నుపాటి విద్య కాంగ్రెస్ కేఎల్‌రావు జనతా
1984 వడ్డేశోభనాద్రీశ్వరరావు తెదే చెన్నుపాటి విద్య కాంగ్రెస్
1989 చెన్నుపాటి విద్య కాంగ్రెస్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెదే
1991 వడ్డేశోభనాద్రీశ్వరరావు తెదే చెన్నుపాటి విద్య కాంగ్రెస్
1996 పర్వతనేని ఉపేంద్ర కాంగ్రెస్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెదే
1998 పర్వతనేని ఉపేంద్ర కాంగ్రెస్ దాసరి జైరమేష్ తెదే
1999 గద్దె రామ్మోహన్ తెదే పర్వతనేని ఉపేంద్ర కాంగ్రెస్
2004 లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ చలసాని అశ్వనీదత్ తెదే
2009 లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ వల్లభనేని వంశీమోహనరావు తెదే
2014 కేశినేని శ్రీనివాస్ (నాని) తెదే కోనేరు ప్రసాద్ వైకాపా

చిత్రాలు.. చెన్నుపాటి విద్య *కేఎల్ రావు *వడ్డే శోభనాద్రీశ్వర రావు