రాష్ట్రీయం

మన గెలుపు ఏకపక్షమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: మేం అధికారంలోకి వస్తే పింఛన్ రూ 3 వేలకు పెంచుతాం, వయో పరిమితిని కూడా 60 ఏళ్లకు తగ్గిస్తాం, పట్టణాల్లో పేదలందరికీ ఉచిత ఇళ్ల నిర్మాణం, ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు తమ మేనిఫెస్టోలో అంశాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. వైసీపీ మేనిఫెస్టోలో భూకబ్జాలు.. దోపిడీ మినహా మరేదీ ఉండదని విమర్శించారు. ఆ పార్టీకి ఓటేస్తే శాశ్వత సమాధి తప్పదని హెచ్చరించారు. ఎలక్షన్ మిషన్-2019పై ఉండవల్లిలో తన నివాసం నుంచి బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ నేతలతో సోమవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఈ పదిరోజులు ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలన్నారు. ప్రభుత్వ లబ్ధిదారులే పార్టీకి బలమని చెప్తూ 3.91 కోట్ల ఓటర్లలో సగం మందికి పైగా మహిళల ఓట్లన్నీ టీడీపీకే అని ధీమా వ్యక్తం చేశారు. రుణమాఫీ పొందిన 55 లక్షల మంది రైతుల మద్దతూ తమకే అన్నారు. పింఛన్లు పొందుతున్న మరో 55 లక్షల మంది టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలన్నారు. వార్ వన్‌సైడ్ అని స్పష్టం చేశారు. ఐదేళ్ల అభివృద్ధి, సంక్షేమమే పార్టీకి శ్రీరామ రక్షన్నారు. 2014లో రుణమాఫీ సాధ్యం కాదని చెప్పి, ఇప్పుడు అన్నీ చేస్తామని వైసీపీ నేత జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. దోచుకోవటమే తప్ప సంపద సృష్టించటం ఆయన వల్ల కాదన్నారు. దోపిడీ, నేరాలపైనే జగన్ ఆలోచనలన్నీ అన్నారు. వ్యవస్థల నిర్మాణం, సంక్షేమం పట్టదన్నారు. నిలువెల్లా అహంభావం తప్ప అనుభవం లేదని వ్యాఖ్యానించారు. జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే బుకాయిస్తారని ధ్వజమెత్తారు. వైసీపీకీ ఓటేస్తే పింఛన్లు ఆగిపోతాయని, పంట పొలాలకు నీళ్లు రావన్నారు. పండ్ల తోటలు ఎండిపోతాయన్నారు. ఏపీని దెబ్బతీయటమే కేసీఆర్ కుతంత్రమని మండిపడ్డారు. రాష్ట్రంపై అసూయతో జగన్‌తో లాలూచీపడి ఓర్వలేని తనంతో అభివృద్ధికి ఆటంకాలు కల్పించారన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకూడదనేది కేసీఆర్ అంతరంగమని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో తన డమీ అధికారంలోకి వస్తే నీళ్లు అందకుండా చేసే కుతంత్రాలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేత పవన్‌కళ్యాణ్ నాలుగు పార్టీలను దుమ్మెత్తిపోస్తున్నారని, టీడీపీ, వైసీపీని ఒకేగాట కడుతున్నారని ఆక్షేపించారు. మోదీ, కేసీఆర్‌లను నిలదీసే ధైర్యం జగన్‌కు లేదన్నారు. ఒక్క వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే గెలిచినా కేసీఆర్‌కే లాభమని మనవేలితో మన కన్ను పొడిచేస్తారని హెచ్చరించారు. వాళ్ల బతుకుల కోసం మన బతుకులు సమాధి చేస్తారా అని నిలదీశారు.
హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులను వేధిస్తే ఇకపై సహించేదిలేదని స్పష్టం చేశారు. ఆస్తులున్న వారిని బెదిరింపులకు గురిచేస్తే పర్యవసానం తప్పదన్నారు. ఏపీ గడ్డపై పుట్టిన వారంతా మోదీ, కేసీఆర్ వ్యతిరేకులేనని, వారిని ప్రశ్నించని వైసీపీ కూడా వ్యితిరేక పార్టీయే అన్నారు. మన నీళ్లకు, ప్రాజెక్టులకు అడ్డంపడే వారితో జగన్ మిలాఖత్ అయ్యారన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల హక్కుల సాధన కోసం తాను ధర్మ పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రానికి పెను విపత్తుల కంటే పెద్ద సమస్యగా జగన్ మారారని విమర్శించారు. జైళ్లకు పంపితే పారిశ్రామిక వేత్తలు ఏపీకి వస్తారా? కేసుల్లో ఇరికిస్తే అధికారులు పనిచేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాకపోతే ఏపీలో ఉపాధి కల్పన ఆగిపోతుందని, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీకీ ఓటేస్తే నేరగాళ్లు స్వైరవిహారం చేస్తారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రశాంతంగా జీవించ వచ్చన్నారు. టీడీపీ మిషన్ 150 ప్లస్ సక్సెస్ చేయాలని 25 ఎంపీ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లలో పార్టీని గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.