రాష్ట్రీయం

795నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 795 నామినేషన్లు దాఖలయ్యాయని చీఫ్ ఎలక్టోర్ అధికారి (సీఈఓ) డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్, నోటిఫికేషన్, నోటీస్‌ల ప్రకారం తెలంగాణలో మొదటి దశలోనే ఎన్నిక లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించే గడువు సోమవారంతో ముగిసింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత రజత్‌కుమార్ సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ నెల 22 వరకు 225 నామినేషన్లు దాఖలు కాగా, కేవలం సోమవారం ఒక్కరోజే 570 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికే 245 నామినేషన్లు దాఖలయ్యాయని, అతితక్కువగా మెదక్ స్థానానికి 20 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. మిగతా 16 పార్లమెంట్ స్థానాలకు కలిపి 454 నామినేషన్లు దాఖలయ్యాయని వివరించారు.
నామినేషన్ల పరిశీలన మంగళవారం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఒక్కో అభ్యర్థి తరఫున ఒక ప్రతినిధి హాజరు కావచ్చని రజత్ కుమార్ తెలిపారు. ఈ నెల 28 మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఉందని రజత్ కుమార్ చెప్పారు. ఏప్రిల్ 11 న పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సోమవారం వరకు ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కొత్త పేర్లను చేర్చామన్నారు. తాజా వివరాల ప్రకారం రాష్ట్రంలో 2,96,97,279 మంది ఓటర్లు ఉన్నారన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 1,49,19,751 కాగా, మహిళలు 1,47,76,024 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 1504 మంది ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా 3,89,676 మందిని ఓటర్ల జాబితాలో చేర్చామని వివరించారు. మొత్తం ఓటర్లలో దివ్యాంగులు 5,13,762 మంది ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 41,77,703 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 2,47,419 మంది ఓటర్లు ఉన్నారన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా చూస్తే మల్కాజిగిరిలో అత్యధికంగా 31,49,710 మంది ఓటర్లు ఉండగా, అతితక్కువగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1,45,509 మంది ఓటర్లు ఉన్నారు.
14.78 కోట్ల రూ.లు స్వాధీనం
-----------------------
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 10.09 కోట్ల రూపాయల నగదును పట్టుకున్నామని, 4.69 కోట్ల రూపాయల విలువైన మద్యం, డ్రగ్స్, నార్కోటిక్స్ తదితరాలను స్వాధీనం చేసుకున్నామని రజత్ కుమార్ తెలిపారు.
90 పేర్లు దాటితే బ్యాలెట్ పేపర్
-----------------
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 90 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఎక్కడైనా పోటీలో నిలిస్తే బ్యాలెట్ పేపర్లనే వాడతామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. 90 అభ్యర్థులలోగా ఉంటేనే ఈవీఎంలను వాడేందుకు వీలుంటుందన్నారు.
ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్‌లో రాజకీయ కార్యకలాపాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఫిర్యాదుపై ఈసీఐ ఆదేశాలమేరకు టీఆర్‌ఎస్ పార్టీకి తాను నోటీస్ జారీ చేశానని రజత్ కుమార్ తెలిపారు. అధికారిక భవనాలను రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ కార్యకలాపాలకోసం వాడుకోవద్దన్నారు.
స్టార్ కాంపైనర్లు
-------------
వివిధ పార్టీల తరఫున స్టార్ కాంపైనర్ల జాబితా తమకు అందిందని రజత్ కుమార్ తెలిపారు. బీజేపీ నుండి 40 మంది, సీపీఐ (ఎం) నుండి 40 మంది, కాంగ్రెస్ పార్టీ నుండి 40 మంది, బీఎస్‌పీ నుండి 40 మంది పేర్లు టీఆర్‌ఎస్ నుండి 20 మంది పేర్లు స్టార్ కాంపైనర్లుగా వచ్చాయన్నారు. జనసేన నుండి నలుగురి పేర్లు, ఎంఐఎం ఉండి ఇద్దరి పేర్లు ఇందుకోసం వచ్చాయని వివరించారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రజత్ కుమార్ తెలిపారు.