రాష్ట్రీయం

జనాభా ప్రాతిపదికనే హైకోర్టు ఉమ్మడి చరాస్తుల పంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: జనాభా ప్రాతిపదికన ఉమ్మడి ఏపీ హైకోర్టు చరాస్తులను పంచుకునేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. హైకోర్టుకు సంబంధించి ఉమ్మడి చరాస్తుల పంపకంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అనిల్ చంద్ర పుణేఠా, ఎస్‌కె జోషీల నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో సమావేశం జరిగింది. హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు చరాస్తులను వాటి విలువ ఆధారంగా జనాభా ప్రాతిపదికన పంపకం చేసుకునేందుకు ఈ సమావేశంలో అంగీకారానికి వచ్చారు. కార్లు, షెడ్డర్ యంత్రాలు, ఫ్యాన్లు, ఏసీలు, ఫర్నిచర్, మేసెస్, కోర్టు హాల్ ఎక్విప్‌మెంట్, సెంట్రల్ లైబ్రరీలోని పుస్తకాలు వంటివి జనాభా నిష్పత్తి అనుగుణంగా పంపకం చేసేందుకు నిర్ణయించారు.