రాష్ట్రీయం

శ్రీశైలంపై కేసీఆర్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు/నంద్యాల/కడప: కృష్ణా జలాలను దోచుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీశైలం జలాశయంపై కనే్నశారని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శ్రీశైలం జలాశయంపై తెలంగాణ ప్రభుత్వం పెత్తనం చెలాయించాలని చూస్తోందన్నారు. అందుకే కోడికత్తి పార్టీతో జతకట్టిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు, కడప నగరాల్లో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాతో కలిసి మంగళవారం నిర్వహించిన రోడ్ షోలు, సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీని గెలిపించి పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి పథకాలను మూసివేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం జలాశయంపై పెత్తనం చేపట్టి కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు ముచ్చుమర్రి ద్వారా కృష్ణాజలాలు సీమకు మళ్లించకుండా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. తద్వారా సీమను ఎడారి చేసేందుకు పథకం పన్నారని ఆరోపించారు. ఎన్నికష్టాలు ఎదురైనా శ్రీశైలం జలాశయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం సీమ ప్రజలపై ఉందన్నారు. కేసీఆర్ కుట్రను తిప్పి కొట్టాలంటే సీమ ప్రజలు కోడికత్తి పార్టీని తరిమికొట్టాలన్నారు. నీళ్లు ఇవ్వకూడదంటున్న కేసీఆర్‌కు జగన్ మద్దతు ఇవ్వడం ముమ్మాటికీ తప్పేనన్నారు. శ్రీశైలం నుండి నీళ్లు వచ్చే పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రిని మూసేయాలని కేసీఆర్ అంటుంటే, అలాంటి వ్యక్తికి జగన్ మద్దతు ఇవ్వడం తప్పేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
జగన్ మద్దతుతో రాయలసీమకు నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీళ్ల ఆటలు సాగవని చంద్రబాబు అన్నారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుండి సీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలకు తాగు, సాగునీరు అందించి సస్యశ్యామలం చేసే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందన్నారు. ఈసారి అధికారం ఇస్తే సీమలోని సాగునీటి పథకాలన్ని పూర్తి చేస్తానని బాబు హామీ ఇచ్చారు.
రాష్ట్రానికి ద్రోహం చేసిన వారు జగన్‌కు ఆప్తమిత్రులు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందితే తెలంగాణ పరపతి పడిపోతుందనే దురుద్దేశంతో అడుగడుగునా కేసీఆర్ అడ్డుతగులుతున్నారన్నారు. కేసీఆర్‌కు జగన్ వంతపాడుతున్నారన్నారు. పైగా కేసీఆర్‌తో స్నేహం చేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించడం జగన్ నైజానికి అద్దం పడుతోందని బాబు మండిపడ్డారు. కేవలం తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడం, అక్రమంగా సంపాదించిన ఆస్తులను రక్షించుకోవడం కోసమే జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నారని, రాష్ట్ర ప్రజలపై ప్రేమతో కాదన్నారు. జగన్ వంటి ఆర్థిక ఉగ్రవాదికి ప్రజలు మద్దతు తెలిపితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలను అందించి మరోమారు అధికారం అప్పగిస్తే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం చూసుకునే బాధ్యత తనదేనని బాబు హామీ ఇచ్చారు. జగన్ పార్టీకి ఓటేస్తే నరేంద్రమోదీకి వేసినట్లేనని, కేసీఆర్‌కు వేసినట్లేనని అన్నారు. ప్రత్యేకహోదాకు మద్దతు ఇచ్చే కేసీఆర్ మద్దతు తీసుకోవడంలో తప్పేమిటని జగన్ సిగ్గులేకుండా చెబుతున్నాడని అన్నారు. అది ముమ్మాటికీ తప్పేనని తప్పున్నర తప్పేనని అన్నారు. జగన్ కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రజల జీవితాలను మాఫీ చేయాలని చూస్తే అడ్రసు గల్లంతు చేస్తామని హెచ్చరించాలన్నారు. వైఎస్‌ఆర్ అధికారంలో ఉండగా జగన్ నూరు కంపెనీల సొమ్ముతిన్నాడని, జైలు పాలయ్యాడని చంద్రబాబు అన్నారు. జగన్ పుణ్యమా అని ఐఏఎస్‌లు జైలు పాలయ్యారన్నారు. సొంత చిన్నాన్న హత్య జరిగితే , పోలీసు కేసు పెట్టకుండా కట్లుకట్టి రక్తపుమరకలు తుడిచారని ఆరోపించారు. జగన్ తన చిన్నాన్నను హత్యచేశారా లేదా? అంటూ ప్రజలను ప్రశ్నించారు.

చిత్రం.. కడపలో మంగళవారం ఓ రోడ్ షోలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు