రాష్ట్రీయం

ఆంధ్రా ద్రోహులు ఏకమయ్యారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: బీజేపీ, టీఆర్‌ఎస్‌తో జతకలిసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ద్రోహులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌లో నివసించే జగన్‌కు ఆంధ్ర ప్రజలను తూలనాడితే బాధ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణ గడ్డపై ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారని సోనియాగాంధీపై విరుచుకుపడిన కేసీఆర్‌కు జగన్ ‘బాంచెన్ నీ కాళ్లు మొక్కుతా’ అనటం హేయమన్నారు. కేసుల కోసం మోదీ పాదాలకు, ఆస్తుల కోసం కేసీఆర్ కాళ్లకు మొక్కుతున్న జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు ఏ మాత్రం పట్టవని ధ్వజమెత్తారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎలక్షన్ మిషన్-2019పై పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల్లో టీడీపీకి సానుకూలత పెరుగుతోందని, సంక్షేమ పథకాలపై అపూర్వ ఆదరణ లభిస్తోందని చెప్పారు. జనప్రభంజనం చూసి జగన్‌కు గంగవెర్రులెత్తుతోందని, ఓటమి భయంతో వైసీపీ సైకో పార్టీగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టీడీపీ మిషన్ 150 ప్లస్, 25 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం యావత్తూ వైసీపీకి వ్యతిరేకంగా ఏకం కావాలన్నారు. ఐదుకోట్ల ప్రజలు కేసీఆర్, జగన్ బంధాన్ని ఎండగట్టాలని కోరారు. నల్లబ్యాడ్జీలు, నల్ల జెండాలతో ప్రచారం నిర్వహించాలని, మోదీ రాష్ట్రానికి వస్తే నిరసనలతో హోరెత్తించాలని, టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని నిర్దేశించారు. ఏపీలో కేసీఆర్ పెత్తనంపై ప్రజల్లో ఆవేశం, కోపం పెల్లుబుకుతున్నాయని తెలిపారు. మోసాల కేసీఆర్ టీడీపీలో పదవి ఇవ్వలేదని ఉద్యమం ప్రారంభించారని, ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు కూలగొట్టిన వాళ్లకు జగన్ మద్దతివ్వటం నీచమన్నారు. ఆంధ్రోళ్లు రాక్షసులని విమర్శించి, పోలవరంపై పిటిషన్లు వేసిన కేసీఆర్‌తో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా కుట్రలు పన్నుతున్నారని ఆక్షేపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా వైసీపీ ప్రచారం నిర్వహించిందని ఆరోపించారు. ఆంధ్రుల కష్టార్జితం లక్ష కోట్లు దోచిన కేసీఆర్‌కు మద్దతివ్వటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. శ్రీశైలం నిర్వహణ నాదే అని కేసీఆర్ రంకెలు వేస్తున్నారని, విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కేసీఆర్‌కు సామంతరాజులా మారిన జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇది ఎన్నికల యుద్ధం.. నమ్మకద్రోహుల పార్టీలపై మన పోరాటం.. ప్రజలంతా వీరోచితంగా పోరాడాలని ఆయన కోరారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్‌తో కలసి జగన్నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. హోదా ఎవరిస్తే వారికి మద్దతంటున్న జగన్ కాంగ్రెస్ ఇస్తామంటే ఎందుకు స్పందించరని నిలదీశారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ పిటిషన్లు వేశారని, ఆయన దయాదాక్షిణ్యాల మీద మనం నీళ్లు తీసుకోవాలా అని బాబు ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల కోసం మోదీ, కేసీఆర్‌లకు ఊడిగం చేస్తే ప్రజలంతా ఊడిగం చేయాలా అన్నారు. ఓట్ల తొలగింపు, డేటా చోరీ కుతంత్రాలతో పాటు పోలీసులపై కులముద్ర వేసి డీజీపీని బదిలీ చేయాలని సరికొత్త నాటకానికి తెరలేపారన్నారు. అసమానంగా జరిగిన విభజనపై నాడు పోరాడాం.. నమ్మించి మోసగించిన బీజేపీపై నేడు ధర్మపోరాటం చేస్తున్నాం.. ఈ పోరాటంలో అంతిమ విజయం తెలుగుదేశం పార్టీదే అన్నారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ప్రతి కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. పార్టీ విజయావకాశాలే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు కోరారు.