రాష్ట్రీయం

ధర్మానికి-అధర్మానికి మధ్య యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికలు ధర్మానికి-అధర్మానికి, నీతికి-అవినీతికి మధ్య జరుగుతున్న యుద్ధం వంటిదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికను మంగళవారం నాడిక్కడ ఓ కళ్యాణ మండపంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆవిష్కరించారు. అనంతరం కన్నా మాట్లాడుతూ ఓటమి తప్పదని భావించి చంద్రబాబు కేసీఆర్‌ను బూచిగా చూపుతూ ఆంధ్రావారిని రెచ్చగొడుతుంటే, తనయుడు లోకేష్ సముద్రానే్న తరలించుకు పోయేందుకు చూస్తున్నారంటూ ఏదేదో అర్థంలేని మాటలను మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు పిచ్చోళ్లుగా భావిస్తున్నారన్నారు. ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజలు తెలివితక్కువవారు కాదని, ఇక వీరి డ్రామాలు, మోసాలు ఇక సాగబోవని హెచ్చరించారు. బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల నాటి తన 600 హామీలను ఎన్ని నెరవేర్చారో చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఏడు ముంపు మండలాలను కేసీఆర్ వెనక్కి తీసుకెళతారంటూ అబద్ధపు ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. ఈ దేశానికి ప్రధాన సేవకుడిగా పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ పేదరిక నిర్మూలనకు, దేశ అభివృద్ధి, రక్షణకు నిరంతరం పని చేస్తున్నారని కన్నా అన్నారు. పేదరిక నిర్మూలనకు 127 పథకాలు అమలు చేస్తున్నారని, చంద్రబాబు వాటిపై తన స్టిక్కర్లు వేసుకుని కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. పుల్వామాపై దాడిని కాంగ్రెస్, ప్రతిపక్షాలు, చంద్రబాబు రాజకీయం చేసి దేశ భద్రతకు భంగం కలిగేలా ప్రవరిస్తున్నారని అన్నారు. పాకిస్తాన్‌ను సమర్థిస్తూ మమతా బెనర్జీ, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ పార్లమెంట్‌లో చర్చ జరిగిందంటూ.. వీరు దేశద్రోహులు కాదా? అని ప్రశ్నించారు. మరోసారి మోదీ ప్రధాని కాకుంటే అరాచకం పెరిగిపోతుందని కన్నా పేర్కొన్నారు. చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రాన్ని దోచేయడానికి ఉపయోగించారని విమర్శించారు. విపక్షాలను విమర్శించడం తప్ప... చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి హైదరాబాద్‌లో ఆస్తులు లేవా? అని ప్రశ్నించారు. తన రాజకీయ లబ్ధికోసం హైదరాబాద్‌లోని ఆంధ్రులపై దాడులు జరిగినట్టు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తెలంగాణకు తరలించుకుపోతారని మంత్రి లోకేష్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కన్నా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని రెండు పార్టీలు అవినీతిలో మునిగిపోయాయని ఆరోపించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్నివర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి సమన్యాయం చేసినట్లు చెప్పారు. అవినీతి రహిత పాలనతో దేశాన్ని అభివృద్ధి చేసిన భాజపాకు ఓటేసి తిరిగి మోదీని ప్రధానిని చేయాలని, రాష్ట్రంలో భాజపాకు అధికారం అప్పగించాలని కోరారు.
అరాచక శక్తులను అణచివేస్తా
నరసరావుపేట: నరసరావుపేట ఎంపీగా తాను గెలిచిన వెంటనే ఇక్కడి అరాచక శక్తులను అణచివేస్తానని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, నరసరావుపేట పార్లమెంటరీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో మంగళవారం స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు నలబోతు వెంకట్రావు అధ్యక్షత వహించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో వారి పేరున టాక్స్‌లు వసూలు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సాగిస్తున్న నరకాసురపాలనను ఓటు ద్వారా అంతం చేయాలన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుండి ఎమ్మెల్యేల వరకు ప్రజలను పీడించి తింటున్నారన్నారు.
చిత్రం.. కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ