రాష్ట్రీయం

ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కొద్దిరోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును, కడప ఎస్పీ రాహుల్‌దేవ్ వర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను బదిలీ చేసింది. ఈ ముగ్గురినీ ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలని మంగళవారం ఆదేశించింది. ఇటీవల మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో, అదేవిధంగా వివిధ జిల్లాల్లో పోలీసు అధికారులు అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని, డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైకాపా నేతలు గత కొద్ది కాలంగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.