రాష్ట్రీయం

25 కోట్ల మందికి అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం: దేశంలో 25 కోట్ల మంది నిరుపేదల బాగుకోసం వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా పథకం అమలు చేయడానికి రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కనీస ఆదాయ భరోసా పథకం చారిత్రాత్మకమైందన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం అమలు చేయలేదన్నారు. ఈ పథకం కింద నిరుపేదలైన 20 శాతం జనాభాకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.6 వేలు, ఏడాదికి రూ.72 వేలు చొప్పున, 5 కోట్ల కుటుంబాలకు అంటే 25 కోట్ల మందికి ఈ పథకం వర్తింపచేయడానికి రాహుల్ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని కాగానే ఈ పథకాన్ని అమలు చేస్తారన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యులు, పేదలు, బడుగు, బలహీనవర్గాల సముద్ధరణే ధ్యేయంగా పని చేస్తుందని చెప్పారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆర్‌టిఐ, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రతా హక్కు చట్టం తదితర పథకాలను పేదల కోసం అమలు చేశామన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్‌గాంధీ ఎన్నికల్లో ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేశారన్నారు. అందులో ముఖ్యమైంది పేదవాడి కనీస ఆర్థిక భరోసా పథకం అని తెలిపారు. పెద్ద నోట్లు రద్దు, జీఎస్‌టీ వంటి ప్రజావ్యతిరేక విధానాలతో ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం అతలాకుతలం చేసిందని, నిరుద్యోగాన్ని పెంచిందని ఆరోపించారు. బడా కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసం రూ.3.17 లక్షల కోట్లు అప్పులను మాఫీ చేసిన బీజేపీ నేతలు పేదల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కనీస ఆర్థిక భరోసా పథకాన్ని విమర్శించడం దారుణమన్నారు. బీజేపీ పేదల వ్యతిరేకి అని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధాని కాగానే దేశ దశ, దిశ మారిపోతుందన్నారు. అందుకే బీజేపీ నేతలు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో నేతలు బాలనరేంద్రబాబు, రాయపాటి ఆశోక్‌చౌదరి, బాన శ్రీనివాసులు, కిశోర్, కృష్ణమూర్తి, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.