రాష్ట్రీయం

నేటి నుంచి కేటీఆర్ రోడ్ షోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బుధవారం నుంచి రాష్టవ్య్రాప్తంగా నిర్వహించనున్న రోడ్ షోలు, బహిరంగ సభల షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేశారు. మార్చి 27 నుంచి వచ్చే నెల ఏప్రిల్ 9 వరకు జరిగే కేటీఆర్ ఎన్నికల ప్రచార పర్యటన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ముస్తాబాద్‌లో, 29న ఎల్లారెడ్డిపేట్, వీరన్నపల్లి మండల కేంద్రాలలో,సిరిసిల్లలో రోడ్ షో, బహిరంగ సభ, 30న హెలిక్యాప్టర్ ద్వారా నర్సంపేట, ములుగు టౌన్‌లో బహిరంగ సభలు, తాండూరు, వికారాబాద్‌లో రోడ్ షోలు, 31న పరిగి, చేవెళ్లలో రోడ్ షోలు, ఏప్రిల్ ఒకటిన ఎల్‌బి నగర్, మహేశ్వరంలో రోడ్ షోలు ఉంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న ఉప్పల్, మల్కాజ్‌గిరిలో రోడ్ షోలు, ఏప్రిల్ 3న హుజుర్‌నగర్‌లో బహిరంగ సభ, సికింద్రాబాద్ కంటోనె్నంట్, మేడ్చెల్‌లో రోడ్ షోలు. ఏప్రిల్ 4న ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ, అంబర్‌పేట, ముషీరాబాద్‌లో రోడ్ షోలు. ఏప్రిల్ 5న కోదాడలో బహిరంగ సభ, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో రోడ్ షోలు. ఏప్రిల్ 6న జూబ్లీహిల్స్ ఖైరతాబాద్, నాంపల్లిలో రోడ్ షోలు. ఏప్రిల్ 7న మహబూబ్‌నగర్ జడ్చర్ల, షాద్‌నగర్‌లో బహిరంగ సభలు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో రోడ్ షోలు. ఏప్రిల్ 8న ఇల్లందు, పినపాకలో బహిరంగ సభలు, కూకట్‌పల్లి, కూత్బుల్లాపూర్‌లో రోడ్ షోలు. ఏప్రిల్ 9న నల్లగొండలో రోడ్ షో ఉంటుందని పేర్కొన్నారు.