రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 26: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సరెడ్డి తన ప్రత్యర్ధి పీఆర్‌టీయు నేత, సీట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్‌పై గెలుపొందారు. నర్సిరెడ్డికి 9021ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన పూల రవీందర్‌కు 6,292ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి విజయానికి అవసరమైన కోటా 9014ఓట్లకుగాను నర్సిరెడ్డికి 38ఓట్లు తక్కువగా వచ్చాయి. దీంతో ఎలిమినేషన్ రౌండ్ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించి గెలుపు మార్క్ ఓట్లు రాగానే నర్సిరెడ్డిని ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ విజేతగా ప్రకటించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12కొత్త జిల్లాలకు సంబంధించి మొత్తం 20,888ఉపాధ్యాయ ఓట్లలో 18,885ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు 858మినహాయిస్తే మిగిలిన 18,027ఓట్లలో గెలిచే అభ్యర్ధికి 9014ఓట్లు రావాల్సివుంది. మూడోరౌండ్‌లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన పిదప నర్సిరెడ్డికి 8976ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన పూల రవీందర్‌కు 6279ఓట్లు రాగా నర్సిరెడ్డికి 2,697ఓట్ల మెజార్టీ లభించింది. నర్సిరెడ్డికి గెలుపు కోటా ఓట్లకు 38ఓట్లు తక్కువగా రావడంతో ఎలిమినేషన్ రౌండ్‌లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో నర్సిరెడ్డి గెలుపొందారు. అతి తక్కువ ఓట్లు పొందిన లింగిడి వెంకటేశ్వర్లు, పారుపల్లి సురేష్, దుర్గం సూరయ్యలను వరుసగా ఎలిమినేషన్ చేయగా నాలుగురౌండ్ల లెక్కింపులోనే గెలుపు సాధనకు నర్సిరెడ్డికి కావాల్సిన ఓట్లు సమకూరాయి. మొత్తంగా నర్సిరెడ్డికి 9021ఓట్లు, పీఆర్‌టీయ రెబల్ పి.సర్వోత్తంరెడ్డికి 1883ఓట్లు, దుర్గం సూరయ్యకు 32, ఏ.చంద్రమోహన్‌కు 354ఓట్లు, ఎస్.మల్లేశ్వర్‌కు 269ఓట్లు, ఎల్.వెంకటేశ్వర్లుకు 14, టి.వి.రాజయ్యకు 194, పి.సురేష్‌కు 55ఓట్లు పోలయ్యాయి.
అలుగుబెల్లి గెలుపుతో ఆయనకు మద్ధతునిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు సంబరాల్లో మునిగాయి. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతు ఉపాధ్యాయ ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించడం ద్వారా తమ చైతన్యాన్ని చాటారన్నారు. తన గెలుపు విద్యారంగానికి మలుపు కావాలని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలువాలన్నారు.
టీఆర్‌ఎస్‌కు షాక్‌నిచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం
టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా భావించే పీఆర్‌టీయు ఉపాధ్యాయ సంఘం బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటమి అధికార పార్టీ వర్గాలకు షాక్‌నిచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన, సీపీఎంకు అనుబంధంగా భావించే యూటీఎఫ్ ఉపాధ్యాయం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందడం రాజకీయంగా సంఛలనంగా మారింది. విప్లవాల ఖిల్లాగా పేరుమోసిన ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు పోరుగల్లు వరంగల్, వామపక్ష ప్రభావిత ఖమ్మం జిల్లాల్లోని ఉపాధ్యాయ ఓటర్లు ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన పూల రవీందర్‌ను ఓడించి నర్సిరెడ్డిని గెలిపించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో సంఛలనాత్మక తీర్పునిచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో విశే్లషణల జోరు మొదలైంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార పార్టీని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం నిరాశ పరిచిందని భావిస్తున్నారు.

చిత్రం.. కౌంటింగ్ కేంద్రం నుండి విజయోత్సాహంతో బయటకు వస్తున్న నర్సిరెడ్డి