రాష్ట్రీయం

కన్నులపండువగా శ్రీ ఖాద్రీ నృసింహుని రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, మార్చి 26: అనంతపురం జిల్లా కదిరిలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవం మంగళవారం కన్నులపండువగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథోత్సవాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. ఉదయం అందంగా అలంకరించిన స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై ఆశీనులను చేశారు. అనంతరం కూష్టాండబలి, పూజల అనంతరం భక్తుల జయజయధ్వనాల మధ్య రథం ముందుకు సాగింది. ఆలయ నాలుగు మాడావీధుల గుండా రథం తిరిగి యథాస్థానానికి చేరుకుంది. రథం కదిలినంతసేపు భక్తులు రథంపైకి దవనం, మిరియాలు చల్లారు. కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్థులు రథానికి వెనుక వైపు నుండి మొద్దులు, తెడ్లు వేస్తూ నియంత్రిస్తుంటే వేలాదిమంది భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు.
చిత్రం.. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవానికి హాజరైన భక్తులు