రాష్ట్రీయం

లోకేష్ నామినేషన్‌పై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 26: గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దాఖలు చేసిన నామినేషన్‌పై వివాదం తలెత్తడంతో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. లోకేష్ ఇంటి చిరునామా తాడేపల్లి మండలం ఉండవల్లి కాగా, కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది సీతారాం నోటరీ చేశారు. అయితే సదరు న్యాయమూర్తి తన పరిధిలోకి రాని గ్రామాన్ని నోటరీ ఎలా చేస్తారని వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనిపై వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని డిమాండ్ చేశారు. నోటరీ నిబంధనల ప్రకారం ఈ నామినేనషన్ చెల్లదని, తప్పుడు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మంగళవారం కొన్ని గంటల పాటు లోకేష్ నామినేషన్ ఆమోదిస్తారా లేక తిరస్కరిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగింది. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి రిటర్నింగ్ అధికారి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సాయంత్రం 6 గంటల సమయంలో టీడీపీ అభ్యర్థి లోకేష్ నామినేషన్‌ను ఆమోదిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి మసూమా బేగం అందజేశారు. దీంతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.