రాష్ట్రీయం

ఇంధన పొదుపులో టీఎస్ ఆర్టీసీకి 4 అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంధన పొదుపులో టీఎస్‌ఆర్టీసీకి నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలోఏటా ప్రామాణికంగా ఎంపిక చేస్తారు. ఈ అవార్డులు ఢిల్లీలో మంగళవారం నాడు ఎఎస్‌ఆర్‌టీయు అధ్యక్షుడు మోర్త్, కార్యదర్శి సంజీవ్‌రాజన్ నుంచి తెలంగాణ ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ అందుకున్నారు. హైదరాబాద్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు ఇంధన పొదుపును పాటించినందుకు ఈ అవార్డులు దక్కాయని సునీల్ శర్మ అన్నారు. అవార్డులు రావడానికి ముఖ్యంగా అధికారులు, కార్మికులు చేసిన కృషి ఫలితం అన్నారు. అవార్డుల కార్యక్రమానికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం నాయక్, రవిచందర్, వేంకటేశ్వర్లు, మునిశేఖర్ తదితర అధికారులు హాజరు అయ్యారు.

చిత్రం.. అవార్డులు అందుకుంటున్న ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ