రాష్ట్రీయం

పోలీసుల అతి.. ప్రయాణికుల ఇక్కట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, నవంబర్ 20: వర్షాలకు జాతీయరహదారి కుంగిపోయి నిన్న రాత్రి నుంచి ఒకపక్కే రాకపోకలు జరుగుతుండగా సిఎం రాక సందర్భంగా పోలీసులు వాహనాల నిలుపుదల చేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. పోలీసుల అతి వల్ల నాలుగుగంటలపాటు ప్రయాణికులు నరకం అనుభవించారు. కలకత్తా-చెన్నై మార్గంలో మండల పరిధిలోని జాతీయరహదారిపై మనుబోలు వద్ద గండి పూడ్చి వాహన రాకపోకలను గురువారం రాత్రి నుండి ఒకవైపున పునరుద్ధరించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గాన శుక్రవారం రేణిగుంట నుంచి వస్తున్నారని సమాచారం అందడంతో నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్లే మార్గంలో సుమారు 4గంటలపాటు వాహనరాకపోకలను పోలీసులు ఆపేశారు. దీంతో విసుగెత్తిన ప్రయాణికులు, వాహనచోదకులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్న పోలీసులపై తిరగబడి ఆందోళన చేశారు. ఓపిక నశించిన వాహనచోదకులు పోలీసులను తోచుకుంటూ బలవంతంగా గూడూరు వైపు ద్విచక్రవాహనదారులు, కార్లు గూడూరు వైపు పయనించడంతో చేసేది లేక పోలీసులు చేష్టలుడిగి చూస్తుండి పోయారు. అప్పటికీ లారీలు, బస్సులను అనుమతించలేదు. దీంతో అక్కడ పద్మవ్యూహ్యంలా కన్పించింది. . వరదలకు జాతీయరహదారి కోసుకుపోయిన మార్గంలో ఓ వైపు రోడ్డును మాత్రమే పునరుద్ధరించడంతో వాహనాల రాకపోకలను రెండు వైపుల ఒక్కొక్క గంట చొపున్న అనుమతిస్తున్నారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి రాకపోకలు నత్తనడకన సాగుతున్నాయి. పులిమీద పుట్రలా దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గూడూరు పర్యటన తోడవడంతో పోలీసులు అత్యుత్సాహం చూపిసూ మనుబోలు బైపాస్ రోడ్డు వద్ద గూడూరు వైపు వెళ్లే వాహనాలను ఆపివేశారు. వరద ముంపు తగ్గి ఐదురోజులైనా ప్రభుత్వం, స్వర్ణ టోల్‌వే అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్రంగా విమర్శించారు.

సిఎం రాక సందర్భంగా హైవేపై
ఆపేయడంతో పడిగాపులు కాస్తున్న ప్రజలు