రాష్ట్రీయం

వర్షాలతో తెలుగునేల పులకించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరయ్యారు. వేడుకల ప్రారంభోత్సవ సమయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హాజరుకాగా, గంట ఆలస్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. అప్పటికే కెసిఆర్ వెళ్లిపోయారు. చాలా రోజుల తర్వాత రాజ్‌భవన్‌లో ఇద్దరు సిఎంలు మళ్లీ కలుసుకోబోతున్నారని అంతా భావించారు. అయితే చంద్రబాబు ఆలస్యం గా రావడంతో వారు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. చంద్రబాబు మాట్లాడుతూ, ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసి తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గత సంవత్సరం కొత్త రాష్ట్రంలో కొత్త కష్టాలను ఎదుర్కొన్నామన్నారు. తెలుగువారికి ఉగాది పండుగ ఎంతో విశిష్టమైనదనీ, అలాంటి పండుగను గవర్నర్ ఒక రోజు ముందుగానే తీసుకువచ్చారని చమత్కరించారు. గవర్నర్ తెలుగు వారి సంప్రదాయ రీతిలో పంచెకట్టు ధరించడాన్ని చంద్రబాబు అభినందించారు. గవర్నర్ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, ప్రజల కష్టాలన్ని తొలగిపోతాయన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గవర్నర్ శాలువ కప్పి సన్మానించారు.
అంతకుముందు ఉగాది వేడుకలను ప్రారంభించిన అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ, కొత్త సంవత్సరానికి దుర్ముఖి పేరు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈసారి మంచి వర్షాలే కురుస్తాయని శాస్తవ్రేత్తలు చెబుతున్నారని కెసిఆర్ చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పండితులు చెప్పడం హర్హణీయమన్నారు. గవర్నర్ నరసింహన్ స్వతహాగా తమిళుడు అయినప్పటికీ తెలుగు సంప్రదాయానికి ఆచరిస్తూ రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, కాంగ్రెస్ నేత, సినీ హీరో చిరంజీవి దంపతులు, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీతో పాటు ఇరు రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లు, ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, పలువురు జడ్జీలు హాజరయ్యారు.

చిథ్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు