రాష్ట్రీయం

వడదెబ్బకు 54మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: రాష్ట్రంలో వడగాడ్పులకు 45 మంది మృతి చెందారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం చెప్పారు.శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరులో ముగ్గురు, అనంతపురం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో 16 మంది మృతి చెందారని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు మృతి చెందారని ఆయన చెప్పారు. వడగాడ్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వడగాడ్పుల బారిన పడిన వారికి తక్షణం వైద్యం అందించేందుకు ఆయా ఆస్పత్రుల సిబ్బంది సిద్ధంగా ఉండాలని, చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని చెప్పారు. వడగాడ్పుల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ప్రజలు వడగాల్పుల బారిన పడకుండా ఉండేలా కలెక్టర్లు పెద్ద ఎత్తున అవగాహన ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ పనిచేయకుండా పనివేళల్లో మార్పులు చేయాలని కూడా అధికారులకు సూచించారు.50 కూలీలు పనిచేసే చోట ఒక వ్యక్తి వారికి మంచినీళ్లు, మజ్జిగ అందించేలా చూడాలని పేర్కొన్నారు.
వడదెబ్బతో తొమ్మిది మంది మృతి
ఆదిలాబాద్/నల్లగొండ/వరంగల్/నిజామాబాద్/మెదక్, ఏప్రిల్ 7: భానుడి ప్రతాపానికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట, మండలంలోని దౌడపల్లి గ్రామానికి చెందిన కలిగంటి రాజలింగు (75) మంచిర్యాల పట్టణంలోని భగవంతంవాడకు చెందిన పుట్ట రాయమల్లు (66), ఇదే మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన కల్వల చిన్నయ్య (40) వడదెబ్బతో గురువారం మృతి చెందారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా మునగాల మండల పరిధిలోని బరాఖత్‌గూడెం గ్రామ ఆవాసమైన శ్రీనివాస్‌నగర్‌కు చెందిన చెవుల బక్కమ్మ (50), నిడమనూరు మండలం శాఖాపురం గ్రామానికి చెందిన గనెపల్లి ఆదాము (35) అనే వ్యక్తి వడదెబ్బతో గురువారం మృతి చెందారు. వరంగల్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో కల్లూరి గోవిందమ్మ (44), మోద్గులగూడెం గ్రామంలో చింతమల్ల స్వామి (60) గురువారం వడదెబ్బతో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గంగరమంద గ్రామానికి చెందిన దేవేందర్(48)అనే ఉపాధి హామీ కూలీ గురువారం మధ్యాహ్నం వడదెబ్బతో మృతి చెందాడు. మెదక్ జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేటలో బెండ రవి (45) అనే వ్యక్తి వడదెబ్బతో మరణించాడు.