రాష్ట్రీయం

రెండేళ్ళు ఏం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: అక్షయ గోల్డ్ కేసు విచారణ తీరు పట్ల హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి ఈ నెల 21వ తేదీన కేసుకు సంబంధించి పూర్తి నివేదిక వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అక్షయగోల్డ్‌కు సంబంధించి నిందితులందరినీ అరెస్టు చేయాలని, వారిని విచారించే కింది కోర్టులో బెయిల్‌ను కూడా వ్యతిరేకించాలని, ఈ కేసును హైకోర్టు పర్యవేక్షిస్తోందని తెలియచేయాలని హైకోర్టు సిఐడి శాఖను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ ఎస్‌వి భట్ విచారణ జరిపారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని నియమించి బాధితులకు న్యాయం చేయాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన ఏపి అక్షయ గోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు విఎస్‌ఎస్ పూర్ణ చంద్రరావు పిటిషన్ దాఖలు చేశారు. అక్షయ గోల్డ్ చైర్మన్ కోర్టుకు హాజరయ్యారా అని హైకోర్టు ప్రశ్నించింది. హాజరైనట్లు అక్షయ సంస్థ న్యాయవాది తెలిపారు. చైర్మన్‌ను చూసిన హైకోర్టు ధర్మాసనం, ఆయనను చూస్తే డమీ వ్యక్తిలా కనపడుతున్నారని, ఈ వ్యవహారంలో మరి కొంత మంది ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసులో సిఐడి ఇంతవరకు కీలకమైన వ్యక్తి సుబ్రహ్మణ్యంను ఎందుకు అరెస్టు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఏపి ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సుబ్రహ్మణ్యం 17 కేసుల్లో నిందితుడని, పరారీలో ఉన్నారన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుని, ఈ కేసు దర్యాప్తు తీరు సరిగా లేదని, ఇతర ఏజన్సీలకు కేసు దర్యాప్తును అప్పగిస్తే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే రెండేళ్ల కాలాన్ని సిఐడి వృథా చేసిందని పేర్కొంది. కాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రి గోల్డ్ కేసులో దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.