రాష్ట్రీయం

పంతంగి టోల్‌గేట్ జామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చౌటుప్పల్, ఏప్రిల్ 10: ఏపీలో ఓటేయడానికి జంటనగరాల నుంచి జనం వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. వందలాది వాహనాలు పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరాయి. హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారి ప్రయాణికులతో పోటెత్తింది. సంక్రాంతి పండుగను మరిపించే విధంగా టోల్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం రాత్రి 10.00 గంటల నుంచి ట్రాఫిక్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. బుధవారం ఉదయం 10.00 గంటల వరకూ భారీగా ట్రాఫిక్ కొనసాగింది. పంతంగి టోల్ వద్ద సుమారు కిలోమీటర్‌మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజా వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్యాగ్ కూడా పని చేయలేదు. టోల్ దాటేందుకు గంటల తరబడి సమయం తీసుకుంది. ఓపిక నశించిపోయిన ప్రయాణికులు జీఎంఆర్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బారికేడ్లను తొలగించుకుని ప్రయాణికులు ముందు దూసుకువెళ్లారు. రద్దీ ఉన్నప్పుడు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. టోల్ వద్దనే గంటల తరబడి వేచి ఉంటే గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకోవాలంటూ ఘర్షణకు దిగారు. సీఐ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకోని పరిస్థితిని చక్కదిద్దారు. వాహనదారులను శాంతింపజేసారు. మోబైల్ యంత్రంతో టోల్ వసూలు చేశారు. ఒక్కసారిగా వాహనాలు రావడంతో సిబ్బంది అనేక అవస్థలు పడ్డారు. విజయవాడ వైపునకు పది టోల్ గేట్లను తెరిచి వాహనాలను పంపించారు. మూడు గంటల పాటు పోలీసులు, జీఎంఆర్ సిబ్బంది శ్రమించి అతి కష్టం మీద ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేశారు. మధ్యాహ్నానికి పరిస్థితి చక్కబడంతో పోలీసులు, జీఎంఆర్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రాత్రికి కూడా వాహనాలు పెరిగే అవకాశాలు ఉండటంతో సిబ్బంది అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు.
చిత్రం.. పంతంగి టోల్ వద్ద బారులుతీరిన వాహనాలు