రాష్ట్రీయం

ఓటుకు ఛార్జీ పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 10: ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకోవడం వ్యాపార లక్షణం. ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో, వాటి ధరలు అమాంతం పెంచేసి, లాభాలార్జించాలన్న వ్యాపార ధృక్పథం ఇప్పుడు రవాణా రంగంలో స్పష్టంగా కన్పిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడం, ప్రలోభాలకు గురిచేయడం సాధారణమే. అయితే ఈ సారి ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలకు చాలా కీలకం కావడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన వేలాది మంది తెలంగాణ రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. కొంతమంది చిరుద్యోగులు, వృత్తి పనివారు కూడా వీరిలో ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ఒక ఓటు కూడా కీలకమే కావడంతో పోటీలో ఉన్న వారు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. తెలంగాణాలో ఉన్న ఉత్తరాంధ్ర ఓటర్లను రప్పించేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఎలాగూ పోలింగ్ రోజన సెలవు కాబట్టి వచ్చి ఓటేసి వెళ్లండంటూ బతిమాలుతున్నారు. పార్టీ, అభ్యర్థి, బంధుత్వాలు, కులం ప్రాతిపదికన ఓటర్లను ఆకర్షిస్తూ సొంతూళ్లకు రప్పిస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి సంఖ్య దాదాపు అయిదు లక్షలకు పైనే. వీరిలో 50 శాతం ఓటర్లు తమ సొంత ఊర్లలో ఓటేసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో రవాణా సదుపాయం గగన కుసుమమైపోయింది. హైదరాబాద్ నుంచి విశాఖ రావాలంటే టికెట్ ధరలు ఆకాశాన్నంటున్నాయి. సాధారణ రోజుల్లో నాన్ ఏసీ బస్‌కు టికెట్ ధర రూ.800 నుంచి రూ.1,000 ఉండగా, ప్రస్తుతం రూ.1,200 నుంచి రూ.2,390 వసూలు చేస్తున్నారు. ఇదే ఏసీ బస్‌లో సాధారణ రోజుల్లో ధర రూ.1,200 నుంచి రూ.1,500 కాగా ప్రస్తుతం రూ.రూ.1,900 నుంచి రూ.3,590గా ఉంది.
ఇక తిరుగు ప్రయాణంలో 11వ తేదీన విశాఖ నుంచి హైదరాబాద్‌కు నాన్ ఏసీ సర్వీసులకు రూ.1,000 నుంచి రూ.1,990 ఉండగా, ఎసీ సర్వీసులకు రూ.1,700 నుంచి రూ.3,750 వసూలు చేస్తున్నారు. ప్రయాణ తేదీ 12న కూడా ధరలు 20 శాతం పెరిగాయి. 14 ఆదివారం సాయంత్రం విశాఖ నుంచి తిరుగు ప్రయాణపు ఛార్జీలు మోత మోగుతోంది.