రాష్ట్రీయం

పోలింగ్ సంతృప్తికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 11: రాష్ట్రంలో పోలింగ్ సంతృప్తికరంగా జరిగినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
సాయంత్రం 5 గంటల వరకూ 66 శాతం పోలింగ్ జరిగిందని, 6 గంటలకు 74 శాతం జరిగిందని వెల్లడించారు. 80 శాతం వరకూ జరగవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 9 గంటలకు 400 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోందని వివరించారు. పోలింగ్ జరుగుతున్న కారణంగా పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. రాత్రి ఎంత సమయమైనా క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. పోలీసుల నివేదిక ప్రకారం ఘర్షణలు, రాళ్లు విసురుకోవడం వంటి ఘటనలు 25 జరిగినట్లు తెలిపారు. ఇద్దరు మృతి చెందారన్నారు. పోల్ డైరీ, వెబ్ క్యాస్టింగ్, వీడియో రికార్డింగ్‌ల ఆధారంగా, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడు, జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. వీటిపై తదుపరి చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారాలపై, రీ పోలింగ్‌పై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సి ఉందన్నారు. పూతలపట్టు, తాడిప్రతి ఘటన ప్రభావం కూడా పోలింగ్‌పై పడిందన్నారు. రీపోలింగ్‌కు సంబంధించి రాజకీయ పార్టీలు నుంచి చాలా ఫిర్యాదులు అందాయన్నారు. దీనిపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,959 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, మాక్ పోలింగ్ తరువాత ఈవీఎంల్లో డేటా తీయని కేసులు ఆరు నమోదైనట్లు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవరించినట్లు రుజువైతే, ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈవీఎంల విధ్వంసానికి సంబంధించి 7 కేసులు నమోదు చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 3 గంటల తరువాత పోలింగ్ జరగలేదని సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారి పరిశీలన నిమిత్తం పంపామని తెలిపారు.
చిత్రం..విజయవాడలోని ఓ పోలింగ్ కేంద్రం