రాష్ట్రీయం

బరితెగించిన వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 11: రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే హింస, విధ్వంసాలకు పాల్పడిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ చేసిన హత్యా రాజకీయాలను ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ మద్దతుతో వైసీపీ పేట్రేగిందని మండిపడ్డారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోనివ్వకుండా భయభ్రాంతులకు గురిచేసిందని ధ్వజమెత్తారు. నేరగాళ్లకు అపజయం తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు రౌడీ గ్యాంగ్‌లను రంగంలో దించిందని ఆరోపించారు. హత్యలు..హత్యాయత్నాలు.. రాళ్ల దాడులు.. వాహనాల విధ్వంసానికి పాల్పడ్డారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ నేత సిద్ధా భాస్కర్‌రెడ్డి హత్యను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి చేయటంతోపాటు చొక్కా చింపివేసి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. ఆళ్లగడ్డలో భూమా వౌనిక, అఖిలప్రియ భర్తపై దాడి చేశారని, రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థి మాగంటి రూప వాహనాన్ని ధ్వంసం చేశారని, చీరాల, రాప్తాడు, ఆత్మకూరు, పుంగనూరులో దౌర్జన్యాలకు దిగారన్నారు. వైసీపీ కరుడుగట్టిన నేరస్థుల పార్టీ అనేది ఈ సంఘటనలతో రుజువైందన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని శాంతి స్థాపనకు ప్రజలు నాంది పలకాలని కోరారు.
ఈవీఎంలతో దగా.. ఈసీ నిర్లక్ష్యం
అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈవీఎంలను పక్కన పెట్టి ఎన్నికల్లో బ్యాలెట్ ప్రక్రియను అమలుచేస్తున్నారని ఈ విషయమై దేశవ్యాప్తంగా 22 పార్టీలతో కలిసి ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును సైతం పక్కదారి పట్టించిందని ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. గురువారం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోగా మూడుగంటల పాటు పోలింగ్ నిలిపివేయటాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. వీవీ ప్యాట్ రసీదులు కూడా సక్రమంగా ఏర్పాటు చేయలేక పోవటం ఈసీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు క్యూలో నిలుచున్నారని, పోలింగ్ కేంద్రాల వద్ద సరైన వసతులు కూడా కల్పించలేదని ఆరోపించారు. సకాలంలో పోలింగ్ జరిగితే ఓటింగ్ శాతం మరింత పెరిగేదన్నారు. ఈవీఎంలు మొరాయించటం వల్ల చాలామంది వెనుతిరిగి వెళ్లారని ఇందుకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలన్నారు. ఓటు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించేదని చెప్తూ భావితరాల భవిష్యత్‌కు సహనం వహించాలని ప్రజల్ని కోరారు. ఉదయం నుంచి కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్ అండదండలతో వైఎస్సార్ కాంగ్రెస్ ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. రాష్టవ్య్రాప్తంగా 30 శాతం ఈవీఎంలు పనిచేయలేదని ఆయా ప్రాంతాల్లో వెంటనే రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఈవీఎంల దగా జరిగిందన్నారు. విజయవాడలోని అజరయ్య హైస్కూలులో తెలుగుదేశంపార్టీకి ఓటు వేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో పడిందని ఆరోపించారు. చాలా చోట్ల ఇలాగే జరిగిందని ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదకరమన్నారు. ఈవీఎంల వినియోగంలో అవకతవకలపై ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేస్తోందని గుర్తుచేశారు. ఓటింగ్ సమయం ప్రారంభించక ముందే ఈవీఎంల పనితీరుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎన్నికల సంఘం విస్మరించిందని మండిపడ్డారు. వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు.

చిత్రాలు.. ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి.
*ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, *రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది