రాష్ట్రీయం

వేసవి ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 12: వేసవి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్- విజయవాడ - హైదరాబాద్, హైదరాబాద్ - తిరుపతి, కాకినాడటౌన్ - సికింద్రాబాద్, చెన్నై - సంత్రాగచ్చి మధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ - విజయవాడ - హైదరాబాద్ జనసాధారణ ప్రత్యేక రైలు నెంబరు 07192 రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుండి ఏప్రిల్ 13,14,15వ తేదీలలో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడకు సాయంత్రం 7.30 గంటలకు చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి స్టేషన్లలో ఆగుతుంది. 07193 రైలు నెంబరు విజయవాడలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరుతుంది. 13,14,15 తేదీలలో ఈ రైలు నడవనుంది. మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు కూడా పైన పేర్కొన్న స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
హైదరాబాద్ - తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు (రెండు సర్వీసులు). హైదరాబాద్ - తిరుపతి స్టేషన్ల మధ్య నెంబరు 07429 రైలు హైదరాబాదులో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 07430 నెంబరులో 14న తిరుపతిలో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ 07435 ప్రత్యేక రైలు 14వ తేదీన కాకినాడలో సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.35 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్ - కాకినాడ మధ్య 07436 ప్రత్యేక రైలు 13న సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45 గంటలకు కాకినాడ చేరుతుంది.
చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్ఛి సువిధ ప్రత్యేక రైలు: ఈ రైలు 82802 నెంబరుతో చెన్నై సెంట్రల్‌లో ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు 11.30 గంటలకు సంత్రాగచ్ఛి చేరుకుంటుంది. ఏప్రిల్ 13, జూన్ 1 తేదీల్లో ఈ సర్వీసు నడపనున్నారు. నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, బ్రహ్మపురం, కుద్రారోడ్, భవనేశ్వర్, జైపూర్ కియోన్జార్ రోడ్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతుంది.
హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రత్యేక రైలు...
ఈ రైలు 07257 హైదరాబాద్‌లో రాత్రి 10.20 గంటలకు బయలుదేరి 10.45 గంటలకు సికింద్రాబాద్, మరుసటి రోజు ఉదయం 6.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మే నెల 13,20,27 తేదీలలో ఈ రైలు నడపనున్నారు. కాజీపేట, వరంగల్, డోర్నకల్, ఖమ్మం స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
విజయవాడలో ఆగకుండా రాయనపాడులో ఆగే రైళ్ళు
కాకినాడ టౌన్ - లింగంపల్లి - కాకినాడ టౌన్ కాకినాడ ఎక్స్‌ప్రెస్12775/12776 14,15 తేదిలలో బైపాస్ మార్గంలో విజయవాడలో ఆగకుండా రాయనపాడులో ఆగుతుంది.
సంబల్‌పూర్ - నాందేడ్ - సంబల్‌పూర్ (ట్రై- విక్లీ) 20809/20810 ఈ నెల 22,23 తేదిల్లో రాయనపాడులో ఆగుతుంది.
విశాఖపట్నం - నాందేడ్ - విశాఖపట్నం (టై - విక్లీ) 20811/20810 ఈ నెల 22,23 తేదీల్లో విజయవాడలో ఆగకుండా బైపాస్ మార్గంలో రాయనపాడులో ఆగుతుంది.
పలు రైళ్ల రద్దు
దక్షిణ మధ్య రైల్వే ప్రాంతంలో ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న దృష్ట్యా తిరుచినాపల్లి - జోలార్పేట జంక్షన్, సొమనాయక్కన్పట్టి సెక్షన్ మీదుగా నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖాధికారులు శుక్రవారం తెలిపారు.
రైలు నెంబరు 66004 చెన్నై సబర్బన్ టెర్మినల్ సూళ్లూరుపేట లైలు ఏప్రిల్ 11 నుండి 14 వరకు రద్దు చేశారు.
రైలు నెంబరు 66037 సుళ్లూరుపేట - నెల్లూరు మెము, రైలు నెంబరు 66034 నెల్లూరు - తిరుపతి మెము రైలు, రైలు నెంబరు 66040 తిరుపతి - అరక్కోణం మెమురైలు, రైలు నెంబరు 66014 అరక్కోణం - చెన్నై సబర్బన్ టెర్మినల్ మెము రైళ్లు 11వ తేదీ నుండి 14 ఏప్రిల్ వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ సీహెచ్.రాకేష్ తెలిపారు.