రాష్ట్రీయం

భద్రాద్రికి కల్యాణ శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 12: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరామనవమికి ముస్తాబైంది. చలువ పందిళ్లు.. విద్యుద్దీపాల అలంకరణలు.. షామియానాలు తదితర ఏర్పాట్లతో నవమి శోభను సంతరించుకుంది. భద్రాచలంలో ఈనెల 14న సీతారాముల కల్యాణ మహోత్సవం, 15న పట్ట్భాషేకం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్ష మంది భక్తులు వస్తారన్న అంచనాతో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. తెలుగువారు ఆరాధ్యదైవంగా భావించే సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భద్రాచలంలోని మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేసవి దృష్ట్యా భక్తులకు నీడ కల్పించేందుకు చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులకు కల్యాణం అనంతరం కల్యాణ తలంబ్రాలు అందించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. కల్యాణంలో తలంబ్రాలకు ఉన్న విశిష్టత దష్ట్యా ఈసారి 150క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశారు. అలాగే 2 లక్షల లడ్డూలను ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసారి కల్యాణానికి ముఖ్యమంత్రి హాజరు కాలేక పోతున్నట్లు సమాచారం. కాగా పట్ట్భాషేక మహోత్సవంలో గవర్నర్ పాల్గొనున్నారు. ఇప్పటికే గవర్నర్‌కు దేవస్థానం తరుపున రాజపత్రం అందజేసి ఆహ్వానించారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో ధ్వజారోహణం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆలయానికి రక్షణగా ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నవాహ్నిక దీక్షకు అగ్నిప్రతిష్ఠాపన గావించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన సుమారు 200 మంది భక్తులు స్వామివారి కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయ అర్చకులకు అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. దాదాపు 2వేల మంది పోలీసులు భద్రాద్రిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా కల్యాణాన్ని తిలకించే భక్తుల కోసం సెక్టార్ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు.