రాష్ట్రీయం

ఇంతకీ మీ ఓటు దేనికేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతున్నామన్న బెంగతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగ్యోక్తులు విసిరారు. తెలుగు ఓటర్లను గందరగోళంలోకి నెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని శనివారం ఆయన విమర్శించారు. అసలు దేనికి ఓటు వేశారు? సైకిల్‌కా? ఫ్యాన్ గుర్తుకా? అన్నదానిపై చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం లోటస్‌పాండ్‌లో సజ్జల విలేఖరులతో మాట్లాడుతూ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైకాపాను టార్గెట్‌గా చేసుకుని మీడియా సమావేశాలు పెడుతున్నారని, ఇది అత్యంత దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు డ్రామాలకు మే 23న శుభం కార్డు పడుతుందని సజ్జల పేర్కొన్నారు. ఒక గుర్తుకు ఓటువేస్తే మరో గుర్తుకు వెళ్తోందని చంద్రబాబు చెప్పడం అర్థరహితమన్నారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలతో ప్రజల్ని మభ్యపెట్టలేరని ఆయన విమర్శించారు. ఈవీఎంలపై చంద్రబాబుకు అనుమానాలే తప్ప వారి కుటుంబంలో ఎవరూ వాటిపై ఫిర్యాదు చేయలేదని సజ్జల స్పష్టం చేశారు. కనీసం కుటుంబ సభ్యుల నుంచి కూడా చంద్రబాబు ప్రకటనలపై మద్దత్తులేదని ఆయన తెలిపారు. ‘చంద్రబాబుకు ఏమైందో తెలియదు. ఉన్నట్టుండి పోలింగ్‌కు ముందు రోజు పెద్ద డ్రామాకు తెరలేపారు’అని వైకాపా నేత ఎద్దేవా చేశారు. ఒక వైపుఓడి పోతున్నామని తెలిసి కూడా ఈసీ కార్యాలయం ముందు బైఠాయించడం సిగ్గుచేటన్నారు. 2014 ఎన్నికల్లో వైకాపా ఓటమిని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి హుందాగా స్వీకరించారన్నారు. 70 ఏళ్ళ చంద్రబాబు ఇప్పుడు ఏమి చేస్తున్నారో ఆంధ్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు మానసిక స్థితిని వైద్యులే తేల్చాలని ఆయన అన్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి కోసం పోరాడితే, చంద్రబాబు మాత్రం ఢిల్లీలో తెలుగువారి పరువు తీస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు లక్ష మంది ఉన్నా ఎన్నికల సిబ్బంది కోసం నారాయణ, చైతన్య కాలేజీల అధ్యాపకులు అవసరమా? అని నిలదీశారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదుష్టకరమన్నారు. ఎన్నికల్లో వైకాపా పక్షాన ఆంధ్ర ప్రజలు నిల్చారన్నారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను బెదిరించడం నైజంగా మార్చుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రత్యర్థులపై దాడులకు సిద్ధమవుతున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.