రాష్ట్రీయం

ఐటీ గ్రిడ్స్‌పై బిగుస్తున్న ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఐటీగ్రిడ్స్ డేటాచోరీ కుంభకోణంపై మరో కేసు నమోదయింది. దీంతో ఐటీగ్రిడ్స్‌పై ఉచ్చు బిగిస్తోందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఆంధ్ర ప్రజల వ్యక్తిగత సమాచాన్ని ఐటీగ్రిడ్స్ దొంగిలించిన అంశం వాస్తవమేనని ఆధార్ సంస్థ (యూఐడీఏ) అధికారులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆధార్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఐటీగ్రిడ్స్‌పై నమోదు చేశారు. ఐటీగ్రిడ్స్ డేటా కుంభకోణంపై సమాచారం అందివ్వాలని ప్రత్యేక దర్యాప్తు అధికారులు యూఐడీఏకు లేఖ రాశారు. సిట్ లేఖకు ఆధార్ అధికారులు స్పందిస్తూ ఫిర్యాదు చేశారు. ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ పరారీలో ఉన్నాడు. లొంగిపోవాలని పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ అశోక్ నుంచి స్పందనలేదు. దీంతో సిట్ అధికారులు కోర్టు ఆదేశాలతో ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్‌ను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అశోక్ విజయవాడలో ఉన్నట్లు సిట్ అధికారులకు సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు.