రాష్ట్రీయం

తిరుమలలో స్నపన తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేదపఠనంతో శ్రీవారి ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, జేఈఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
హనుమంత వాహనంపై శ్రీ వేంకటాద్రి రాముడు
ఆదివారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రామాయణంలో శ్రీరాముడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడుగా, కలియుగంలో శ్రీనివాసుడుగా భక్తుల నమ్మకం. దాస్యభక్తుల్లో హనుమంతుడు పేరెన్నికగన్నవాడు. వేదాలు, వ్యాకరణాలూ సమస్తమూ క్షుణ్ణంగా తెలిసినవాడు. హనుమంత వాహనంపై సర్వాలంకార భూషితుడై కోదండరాముని అవతారంలో కొలువుదీరిన మలయప్పను దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. కాగా రాత్రి 9 నుంచి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి అస్థానాన్ని వేడుకగా నిర్వహించారు.

చిత్రం... తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తున్న దృశ్యం