రాష్ట్రీయం

అందరూ కలసిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నాయకులు కలసి రావాలని కోరుతూ వివిధ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసినట్టు పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలోని స్వగ్రామం నీలకంఠాపురంలో ఆదివారం రఘువీరా విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం చాలా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ హోదా సాధన కోసం కలసి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు చేసే సమయం ముగిసిందని, ఇకపై రాష్ట్భ్రావృద్ధికి కలసి రావాలని కోరారు. దేశంలో బీజేపీకి అధికారం దక్కదని, థర్డ్ ఫ్రంట్‌కు సైతం అవకాశం లేదని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం కల్పిస్తున్నారన్నారు. పలు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్నారని, వివిధ దశల్లో జరిగే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించే విధంగా వారిని కోరుతూ ఉత్తరాలు రాశానన్నారు. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మడకశిరలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గత 72 సంవత్సరాల్లో దేశం ఎంతో ప్రగతి సాధించిందన్నారు. పేదరికాన్ని రూపుమాపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తోందన్నారు.