రాష్ట్రీయం

చంద్రబాబు ఖేల్ ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటమి భయంతోనే పెడబొబ్బలు పెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. చంద్రబాబు ప్రవర్తనలో, ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. ‘బాబు ఖేల్ ఖతం’ అని వ్యాఖ్యానించారు. గతంలో 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గెలిచింది ఇదే ఈవీఎంలతో కాదా? మరి అప్పుడు లేని అనుమానాలు ఇప్పుడేందుకు? ఎలాగూ గెలిచే పరిస్థితి లేదనేనా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు. తాను గెలిస్తేనేమో టెక్నాలజీ భేష్, లేకపోతే ఈవీఎంల ట్యాంపరింగా? అని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం పార్లమెంట్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు, రెవెన్యూ, మున్సిపల్ కొత్త చట్టాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తదితర అంశాలపై మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై నిజంగా చంద్రబాబుకు నమ్మకం ఉంటే ఢిల్లీలో వీధి నాటకాలు వేయాల్సిన అవసరం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. నేతలు ఎవరైనా ప్రజా తీర్పును స్వాగతించాలని గౌరవించాలే తప్ప ఆయనలాగా పెడబొబ్బలు పెట్టకూడదన్నారు. అక్కడి అధికారులను ఈసీ బదిలీ చేస్తే ఆయనేందుకు భయపడుతున్నారని నిలదీశారు. అక్కడి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్‌రావు తెలంగాణ ఉద్యమ సమయంలో జాహ్నావి పేరుతో విషం కక్కుతూ ఆర్టికల్స్ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. చంద్రబాబును ఇప్పుడు టీడీపీ నాయకులే వింతగా చూస్తున్నారని విమర్శించారు. ఆయన ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో హుందాగా ఉండాలన్నారు. ఆంధ్రలో జరిగిన ఎన్నికలు చంద్రబాబు పాలనకు, తెలంగాణలో జరిగిన ఎన్నికలు తమ పాలనకు నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పోలింగ్ రోజున చార్మినార్ వద్ద క్రికెట్ ఆడితే, అక్కడేమో హింసాత్మక చర్యలు, స్పీకర్ కోడెల పోలింగ్ బూతులో బట్టలు చించుకోవడం వంటి సంఘటనలు జరిగాయన్నారు. అక్కడి, ఇక్కడి పాలనకు మధ్య ఉన్న తేడా అదేనని అన్నారు. తమకు సంస్కారం ఉండటం వల్లనే హుందాగా ఉన్నామన్నారు. లేకుంటే మోదీతో నాలుగేళ్లు అంటకాగిన చంద్రబాబును పెంపుడు కుక్క అనడం మాకు రాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ హుందాగా వ్యవహరించారన్నారు. అవినీతిరహిత పాలనను అందించడానికే చట్టాల్లో సంస్కరణలు తీసుకరావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. దీంట్లో భాగంగానే రెవెన్యూ, మున్సిపల్ చట్టాల్లో మార్పులు తీసుకరావాలని భావిస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి, టీఆర్‌ఎస్ ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతుందన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై ఎప్పటికప్పుడు ప్రాంతీయ పార్టీలతో చర్చిస్తూనే ఉన్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదారు చోట్ల డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని, ఆ పార్టీ ఒక్క సీటు కూడా రాదని అన్నారు. సెటిలర్ ఓటర్లు ఓటు వేయడానికి ఆంధ్రకు వెళ్లకుంటే తమకు మెజారిటీ మరింత పెరిగేదని వ్యాఖ్యానించారు.

చిత్రం...తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న కేటీఆర్