రాష్ట్రీయం

హలో సార్... బాగున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, పోలింగ్ ముగిసే వరకు గవర్నర్ నరసింహన్‌ను కలువని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చాలా రోజుల తర్వాత ఆదివారం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాజా దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలతో పాటు పరిపాలన సంస్కరణలకు శ్రీకారం చట్టడానికి రెవెన్యూ, మున్సిపల్ చట్టాల్లో తీసుకరానున్న మార్పులపై ఈ భేటీ సందర్భంగా గవర్నర్‌కు సీఎం వివరించినట్టు సమాచారం. అలాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో తన చూట్టే తిరిగిన రాజకీయాలు మొదలుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలను కూడా కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తనను తిట్టడం ద్వారా ఆంధ్రలో జరిగిన ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలను వివరిస్తూ, ఎంత రెచ్చగొట్టినా తాను ఆయన ట్రాప్‌లో చిక్కుకుండా హుందాగా వ్యవహరించిన తీరును కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల వల్ల కోడ్ అమలులో ఉండటం వల్ల తీసుకోలేక పోయిన నిర్ణయాలను వివరించినట్టు సమాచారం. భూ ప్రక్షాళన సందర్భంగా క్షేత్రస్థాయిలో జరిగిన అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డా పేరు వచ్చిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవినీతిరహితంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రెవెన్యూ, మున్సిపల్ చట్టాల్లో తీసుకరానున్న మార్పులను సీఎం వివరించారని తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసేలోగా మే 20 వరకు జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి చేయడానికి తీసుకున్న చర్యలను కూడా వివరించారని అంటున్నారు.

చిత్రం... రాజ్‌భవన్‌లో ఆదివారం గవర్నర్‌ని కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్