రాష్ట్రీయం

ఎస్‌ఈసీకి నేడు రిజర్వేషన్ల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ‘పరిషత్’ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) పక్కా ప్రణాళిక రూపొందించింది. ఎస్‌ఈసీ కమిషనర్ వి. నాగిరెడ్డి ఇప్పటికే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్‌లతో జరిపిన చర్చల అనంతరం ఎన్నికల నిర్వహణకోసం సమగ్ర ప్రణాళికను రూపొందించారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్లు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులకు (జడ్‌పీటీసీ) సంబంధించిన రిజర్వేషన్ల వివరాలు ఎస్‌ఈసీకి ప్రభుత్వం సోమవారం సమర్పిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వాస్తవంగా ఈ వివరాలన్నీ జిల్లా కలెక్టర్ల నుండి పంచాయతీరాజ్ శాఖకు ఫిబ్రవరిలోనే వచ్చాయి. అయితే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వల్ల పరిషత్ ఎన్నికలపై కాస్త జాప్యం జరిగింది. వాస్తవంగా పరిషత్ ఎన్నికలకోసం గత ఆరు నెలల నుండే ఎస్‌ఈసీ కసరత్తు చేస్తూ వస్తోంది. తెలంగాణలో ఈ నెల 11న లోక్‌సభ పోలింగ్ పూర్తికావడంతో పరిషత్ ఎన్నికల అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది. లోక్‌సభకు 11న పోలింగ్ జరగగా, కౌంటింగ్ 2019 మే 23న జరుగుతుంది. కౌంటింగ్ కార్యక్రమం వరకు దాదాపు 39 రోజుల సమయం ఉండటం వల్ల రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల సిబ్బందిని పరిషత్ ఎన్నికల కోసం వాడుకునేందుకు అవకాశం ఉందని ఎస్‌ఈసీ భావిస్తోంది. పరిషత్ ఎన్నికలను నెలరోజుల్లోగా పూర్తి చేస్తామని ఎస్‌ఈసీ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల జాబితాను సోమవారం ఎస్‌ఈసీకి అందిస్తుందని వచ్చిన సమాచారం మేరకు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు రిజర్వేషన్ల జాబితా తమ చేతికి వచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తదితరులతో మీటింగ్ ఏర్పాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. అందుకే సోమవారం రోజే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఈ నెల 18న జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు (ఎస్‌పీలు), జిల్లాపరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో (సీఈఓలు) ఎన్నికల కమిషన్ హైదరాబాద్‌లో మీటింగ్ నిర్వహిస్తోంది. అన్ని కోణాల్లో చర్చించి ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తారని తెలిసింది. రాష్ట్రంలో 535 జెడ్‌పీటీసీలు, 5,857 మంది ఎంపీటీసీల పోస్టులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరగగా, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు మాత్రం రాజకీయ పార్టీల గుర్తులతోనే నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు ఒక దశలో నిర్వహించాలా, ఒకటి కన్నా ఎక్కువ దశల్లో నిర్వహించాలా అన్న అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.