రాష్ట్రీయం

ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై టీఆర్‌ఎస్‌లో చేరి న ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సీఎల్‌పీ డిమాండ్ చేసింది. సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఇక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలిచ్చి న మ్యాండేట్‌ను తుంగలో తొక్కి, అనైతిక విధానాలకు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంతారావు, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనమా, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్థన్ రెడ్డిలపై అనర్హత వేటు వేసి, రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాలన్నారు. రాష్ట్రంలో పాలన రాజ్యాం గం ప్రకారం జరగడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ పార్టీ మారేవిధంగా వత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల శాసనసభ్యత్వంను రద్దు చేయాలని ఆయన కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారన్నారు.
అంబేద్కర్ విగ్రహాన్ని విరగగొట్టి చెత్త బండిలో తీసుకెళ్లడాన్ని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని హక్కులను అభిమానించే ప్రతి ఒక్కరినీ అవమానపరచడమేనన్నారు. ఈ సంఘటనకు కారణమైన వారిని పట్టుకుని శిక్షించాలన్నారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపడుతుందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మాజీ ఎంపీ వీహెచ్ ధర్నా
పంజాగుట్ట సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చినందుకు నిరసనగా ఖైరతాబాద్ వద్ద ధర్నా, నిరసనకు దిగిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావుతదితరులను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు అవమానం జరిగిందని హనుమంతరావు ఆరోపించారు.