రాష్ట్రీయం

పట్ట్భాషిక్తుడైన భద్రాద్రి రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 15: ప్రజారంజక పాలనతో నేటికీ ఆదర్శంగా నిలిచిన దశరథ తనయుడు.. రఘువంశ తిలకుడైన శ్రీరాముడు భక్తకోటి జయజయ ధ్వానాల నడుమ పట్ట్భాషక్తుడయ్యాడు. భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి నాడు కల్యాణ రామయ్యగా మెరిసిన భద్రాద్రి రాముడికి సోమవారం మహా పట్ట్భాషేకం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టువస్త్రాలు, పుష్పమాలలు సమర్పించారు. ఒక సమర్థుడైన వ్యక్తికి ప్రజా పరిపాలన అనే పట్టం అందించే కార్యక్రమమే పట్ట్భాషేకం. ప్రపంచంలో రాముడికి మించిన పరిపాలనా దక్షుడు, చక్రవర్తి, రాజు మరెవ్వరూ లేరు. అందుకే శ్రీరాముడికి పట్ట్భాషేకం నిర్వహించడం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో సంప్రదాయంగా వస్తోంది. పట్ట్భాషేక మహోత్సవానికి హాజరైన గవర్నర్ రామాలయంలోపూజల్లో పాల్గొన్నారు. ఆలయం నుంచి పట్టు వస్త్రాలు శిరస్సుపై పెట్టుకుని స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు.
పట్ట్భాషేక క్రమమిది..
ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో నవకలశ స్నపనం చేశారు. చతుస్థానార్చన, చతుర్వేద పంచసూక్తి హవనం, పూర్ణాహుతి, నివేదన, నూతన వస్త్రాలంకరణ అయ్యాక అలంకారం చేశారు. తర్వాత స్వామి ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణ చేసి శోభాయాత్రగా మిథిలా స్టేడియానికి బయలుదేరారు. అక్కడ కల్యాణ మండపంలో ఉత్సవాంగ ఆరాధన, మండపారాధన, దేవతామూర్తుల, ప్రియ భక్తుల కలశావాహన చేశాక మళ్లీ లఘు తిరువారాధన జరిగింది. సువర్ణ పుష్పార్చన, రామాష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం పూజలు, ఫల నివేదన ఇచ్చి మంగళ నీరాజనం పలికారు. ఇక భక్తుల నిరీక్షణకు తెరదించుతూ పట్ట్భాషేక ఘట్టం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్ట్భాషేక ఘట్టాన్ని వివరించే ప్రవచనం చేశారు. కలశాలకు ఆరాధన చేసి ఉద్వాసన పలికారు. సముద్ర తీర్థ జలాలతో స్వామికి సంప్రోక్షణ చేశారు. అనంతరం సువర్ణ కిరీటం ధరింపజేసి మంగళ నీరాజనం పలికారు. రామదాసు చేయించిన చింతాకు పతకం, పచ్చల పతకం అలంకరించారు. ముందుగా స్వర్ణ పాదుకలు, రాజదండం, రాజముద్ర, చామరం అలంకరించారు. తర్వాత రాజాధిరాజ మంత్రం జపిస్తూ వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని స్వామికి అలంకరించారు. తర్వాత సప్తనదీ జలాలు, నాలుగు సముద్ర జలాలతో అభిషేకం జరిగింది. ఇదే రామరాజ్య స్థాపనకు సుమూహూర్తంగా వేద పండితులు ప్రకటించారు. అమ్మవారికి, స్వామికి ముత్యాల దండలు వేయగా స్వామి సీతమ్మకు ఆ దండను సమర్పిస్తారు. ఆ దండను అమ్మవారు ప్రియభక్తుడు ఆంజనేయుడికి ఇచ్చే ఘట్టం అద్భుతంగా సాగింది. ఈ సమయంలో జయ జయ ధ్వానాలు మిన్నంటాయి. ఆంజనేయస్వామితో పాటు మిగిలిన భక్తులందరికీ సముద్ర జలాలను శిరస్సున చల్లారు. అనంతరం స్వామి తిరువీధి సేవగా కల్యాణ మండపానికి బయలుదేరి వెళ్లారు. రాత్రి స్వామికి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణ సీతారాముల పట్ట్భాషేకం పూర్తయిన తర్వాత భక్తులకు రామాలయ మాడవీధుల్లో దర్శనం ఇచ్చారు. గవర్నర్ దంపతులతో పాటు టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, దైవజ్ఞశర్మ, గవర్నర్ సెక్రటరీ సురేంద్రమోహన్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఎస్పీ సునీల్‌దత్ తదితరులు పట్ట్భాషేక మహోత్సవంలో పాల్గొన్నారు.

చిత్రాలు.. భద్రాద్రి రాముడికి సోమవారం పట్ట్భాషేకం నిర్వహిస్తున్న అర్చకులు.
*పట్టువస్త్రాలు సమర్పిస్తున్న గవర్నర్ దంపతులు,