రాష్ట్రీయం

18న ఇంటర్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఈ నెల 18వ తేదీన ఉదయం 10.30 గంటలకు విడుదల చేయనున్నట్టు బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుండి ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు బోర్డు కార్యదర్శి సోమవారం స్పందించారు. వార్షిక పరీక్షలు ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకున్నందున ఫలితాలను 18న తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి, విద్యా భవన్‌లో విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యా మంత్రి జగదీష్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శి జనార్థన్‌రెడ్డి, బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, బోర్డు అధికారులు పాల్గొంటారు. ఇంటర్మీడియట్ జవాబుపత్రాలు భద్రంగా ఉన్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గంటా జగన్మోహన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ జవాబుపత్రాలు గల్లంతయ్యాయని వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని అన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని, ఫలితాల ప్రాసెసింగ్ సజావుగా జరుగుతోందని, తెలంగాణ ఇంటర్ బోర్డు దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైన
బోర్డుగా పేరుగాంచిందని అన్నారు. విద్యార్థులూ , వారి తల్లిదండ్రులూ ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఆయన సూచించారు.
ఏబీవీపీ ధర్నా
జవాబుపత్రాల గల్లంతు ఆరోపణలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోర్డు ఎదుట ధర్నా జరిగింది. ధర్నా చేస్తున్న విద్యార్థి నేతలు సుమన్, శంకర్, సురేష్, రమేష్‌లను అరెస్టు చేసి బేగంబజార్ పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింత ఎల్ల స్వామి , జాతీయ కార్య సమితి సభ్యుడు ప్రవీణ్‌రెడ్డిలు మాట్లాడుతూ ఆంధ్రా, తెలంగాణలో ఒకేమారు ఇంటర్ పరీక్షలు జరిగినా తెలంగాణలో ఇంత వరకూ ఫలితాలు విడుదల కాలేదని ఆరోపించారు.