రాష్ట్రీయం

‘పరిషత్’ ఎన్నికలకు సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చాంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి తన కార్యాలయంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి, పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) మహేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిషత్ ఎన్నికల సన్నద్దతపై సుదీర్ఘంగా చర్చించారు. పరిషత్ ఎన్నికల తేదీలను ఇంకా ఖరారు చేయలేదని, ప్రభుత్వం నుండి రిజర్వేషన్ల వివరాలు అందిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని నాగిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే జాప్యం జరిగిందని, ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మే మొదటి పక్షం వరకు పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించామని, ఇందుకు అనుగుణంగా అన్ని కోణాల్లో ప్రభుత్వం సహకారం కావాలని నాగిరెడ్డి కోరారు. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 32 వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, 1,80,000 మంది సిబ్బందిని ఎన్నికల నిర్వహణకోసం డిప్యూట్ చేస్తే సౌలభ్యంగా ఉంటుందని సూచించారు. ఎన్నికల నిర్వహణకు 150 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఈ నిధులను ఆ యా జిల్లాల యంత్రాంగాలకు పంపించేందుకు వీలుగా వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ నిధులు కూడా వెంటనే ఉపయోగించుకునేందుకు కలెక్టర్లకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎండాకాలంలో జరుగుతోందని, అందువల్ల ఓటర్లకు అవసరమైన తాగునీటిని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తామని, పోలింగ్ కేంద్రాలకోసం పాఠశాలలను, ఇతర భవనాలను కేటాయిస్తామన్నారు. పోలింగ్ నిర్వహణలో ఇతరత్రా వౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 55 వేల మందికిపైగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు హామీ ఇచ్చారు. పోలింగ్‌లో పాల్గొనే వారికి అత్యవసరం అయితే చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
చిత్రం...ఉన్నత స్థాయ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి