రాష్ట్రీయం

వటపత్రసాయి అలంకారంలో ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి తేజోవిలాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రుడు వటపత్రసాయి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. సోమవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడావీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాలు, చెక్క్భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వటపత్రసాయి అలంకారంతో కూడిన శ్రీరామచంద్రున్ని చూసిన భక్తులు ఆధ్యాత్మిక తేజోవిలాసానికి గురయ్యారు. ఈ గ్రామోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అంతకు ముందుగా ఉదయం సుప్రభాత సేవ నిర్వహించిన వేద పండితులు ఆలయ శుద్ధిచేసి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. తదుపరి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు సోమవారం భారీగా తరలివచ్చారు. రాత్రి స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఊంజల్ సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు సింహ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారు నవనీత కృష్ణాలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి హనుమంత వాహనసేవ ఉంటుంది.
సీతారాముల కల్యాణ ఘట్టం చిత్రాలతో సెట్టింగ్
రాష్ట్ర ప్రభుత్వం లాంఛనాలు అందుకోనున్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 18వ తేదీ రాత్రి పౌర్ణమి వెనె్నల్లో జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. కల్యాణ వేదిక ముందు భాగాన సీతారాముల కల్యాణ ఘట్టం చిత్రాలతో పాటు శంఖు చక్రాలు, గరుడస్వామి, ఆంజనేయస్వామి చిత్రాలతో కూడిన సెట్టింగ్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేస్తున్న చలువ పందిళ్లను జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది పెనుగాలుల కారణంగా తలెత్తిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి జర్మన్ టెక్నాలజీతో పందిళ్ల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుద్దీపాలంకరణపై టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ఎలక్ట్రికల్ ఈఈ జగన్మోహన్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి దగ్గరుండి విద్యుత్ దీపాలంకరణలను పరిశీలిస్తున్నారు. శ్రీ కోదండరామాలయం నుండి కల్యాణవేదిక వరకు అర కిలోమీటరు దూరం దారిపొడవునా వివిధ దేవతామూర్తుల విద్యుద్దీప అలంకరణలతో పాటు విద్యుద్దీప కాంతులతో నిండిపోయేలా అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామ పట్ట్భాషేకం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి శ్రీరామ పట్ట్భాషేకం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారు, శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవర్లను రంగనాయకుల మండపానికి వేంచేపు చేశారు. ఉత్సవర్లకు సాయంత్రం విశేష సమర్పణ చేశారు. రాత్రి 8 గంటలకు బంగారు వాకిలి వద్ద ఆలయ అర్చకులు శ్రీరామ పట్ట్భాషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని పట్ట్భాషేక ఘట్టాన్ని పఠించారు.

ఈ ఉత్సవం కారణంగా వసంతోత్సవ సేవను టీటీడీ రద్దు చేసింది. ఈకార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రాలు.. ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణ ఘట్టం చిత్రాలతో ఏర్పాటు చేసిన కల్యాణవేదిక సెట్టింగ్
*వటపత్రసాయి అలంకారంలో ఒంటిమిట్ట కోదండరాముడు (ఇన్‌సెట్‌లో)