ఆంధ్రప్రదేశ్‌

2019 నాటికి దేశవ్యాప్తంగా.. గృహ వినియోగంలోకి ‘ఎల్‌ఇడి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 8: ఎనర్జీ మిగులు ద్వారా వ్యవసాయ గృహ వౌలిక వసతుల కల్పన రంగాల్లో విప్లవాత్మక చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇంధన సమర్థ సేవలు చివరి వినియోగ వ్యక్తి వరకు చేర్చడం ద్వారా ఇంధన సంస్థాగత వినియోగాన్ని క్రమబద్దీకరించబోతుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇందుకు అనువైన వేదికగా ఇఇఎస్‌ఎల్ గుర్తించింది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యంతో నగరంలో రెండు రోజులపాటు విద్యుత్ పొదుపుపై జరిగిన అంతర్జాతీయ సదస్సు శుక్రవారం సాయంత్రంతో విజయవంతంగా ముగిసింది. గృహ వినియోగంలోకి ఎల్‌ఇడి బల్బులను తేవడం ద్వారా వార్షికంగా వంద బిలియన్ యూనిట్లు విద్యుత్‌ను పొదుపు చేయడమే కాకుండా 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నివారించగల్గుతామని ఈ సదస్సు భావించింది. దేశంలో అన్ని నగరాల్లో 2019 నాటికి ఈ లక్ష్యం పూర్తి కోసం ఈ సదస్సులో తగు కార్యాచరణ ఖరారైంది.
రానున్న మూడేళ్లలో 770 మిలియన్ బల్బులను సరఫరా చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇందుకోసం అంచనా మూలధనం పెట్టుబడి 1.2 మిలియన్ యుఎస్ డాలర్లు కాగా వార్షికంగా వినియోగదారు 6.5 మిలియన్ల విద్యుత్ ఖర్చు ఆదా చేయగల్గుతారు. ఇప్పటికే ఇఇఎస్‌సి ఉజాలా పథకం ద్వారా దేశంలో 120 నగరాల్లో 90 మిలియన్ల ఎల్‌ఇడి బల్బులను సరఫరా చేయగల్గారు. ఈ రెండు రోజుల సదస్సులో 15 దేశాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు, వ్యక్తులతో పాటుగా దేశీయంగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలిరోజు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొని దశాదిశ నిర్దేశించారు.
ఆవిష్కరణ భవన నిర్మాణ వ్యవస్థ పథకంలో భాగంగా ఇఇఎస్‌సి ప్రభుత్వ కార్యాలయంలో చేపట్టిన సంస్కరణల వలన ప్రతిరోజుకు నీతి ఆయోగ్ పేజ్-1 కింద 702 యూనిట్స్, శ్రమశక్తి భవనాలు 1227 యూనిట్స్, ఇండియా హెబిట్ సెంటర్‌లోను 1523 యూనిట్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోనూ 1640 యూనిట్స్, పార్లమెంట్ భవనంలో 1523 యూనిట్లు ప్రతి నిత్యం పొదుపు చేయగల్గారు. మొత్తం విద్యుత్ ఉత్పాదనలో 21 మిలియన్ యూనిట్లను వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా చేయడం జరుగుతున్నది. అంటే జాతీయ శక్తి వినియోగంలో 18 శాతం, వ్యవసాయ పంపుసెట్ల వినియోగంలో చర్యలు చేపట్టటం ద్వారా 30 శాతం మేర శక్తి మిగులు సాధించవచ్చని గుర్తించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఈ దశలో ఈ ఏడాది రెండు లక్షల పంపుసెట్లను మార్చబోతున్నది.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యుత్ పొదుపు ఫ్యాన్
ఈ సదస్సులో గృహ వినియోగంలో అత్యధిక ప్రాధాన్యత కల్గిన విద్యుత్ పొదుపు ఫ్యాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోనే తొలిసారి ఇటువంటి గృహ విద్యుత్ ఉపకరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం రూ.1250లు చెల్లించి ఫ్యాన్ కొనుగోలుకు అవకాశం కల్పించారు. దీని ద్వారా ఒక్క ఏడాదిలోనే వెయ్యి రూపాయలు విద్యుత్ బిల్లులో ఆదా సాధ్యమవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విద్యుత్ బిల్లులో సులభ వాయిదాల్లో ప్రతినెలా రూ.60లు లబ్ధిదారుని నుంచి విద్యుత్ సంస్థ వసూలు చేసి కంపెనీకి జమచేస్తుంది. మొత్తం 25 సులభ వాయిదాల్లో ఈ మొత్తం రికవరీ చేయబడుతుందని విద్యుత్ శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు.