రాష్ట్రీయం

సూరీడు.. భగ భగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: జిల్లాలో పగటి పూట ఎండ వేడి ప్రజలను అల్లాడిస్తోంది. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు, గాలి దుమారంతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వేడి గాలులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదిలాబాద్, జైనథ్, బేల, పెంబి, బజార్‌హత్నూర్, వాంకిడి, జైనూర్ మండలాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మధ్యాహ్నం వేళ పట్టణాల్లో జన సంచారం లేక ప్రధాన వీదులు నిర్మానుషంగా మారుతున్నాయి. ఇంటి గడప దాటి బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిం గరేణి గనులతో పాటు వ్యవసాయ పనులకు వెళ్ళాల్సిన కూలీలు ఎండ తీవ్రత నేపథ్యంలో సాయంత్రం వేళల్లో పనులు పూర్తిచేసుకుంటున్నారు. పట్టణాల్లో ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాలు పాక్షికంగా పనిచేస్తుండగా మరోవైపు వృద్దులు, పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. గత వారం రోజులుగా 42 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగడంతో జనజీవనం స్తంభించిపోతోంది. పల్లెల్లో విష జ్వరాలు, కలుషిత నీరు తాగి వ్యాధులతో ఆసుపత్రి పాలవుతున్నారు. గత నాలుగు రోజుల్లోనే వడ దెబ్బసోకి జిల్లాలో ముగ్గురు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. ఉపాధి హామీ కూలీల పరిస్థితి దుర్బరంగా మారింది. పనిచేసే చోట షామియనాలు, తాగునీటి వసతి, కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు వీటి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎండ తీవ్రత నేపథ్యంలో తాగునీటి జలాశయాలు అడుగంటిపోయి నీటి ఎద్దడి తీవ్రరూపం దాలుస్తోంది. మారుమూల గ్రామాల్లో దప్పిక తీర్చుకునేందుకు గ్రామీణ ప్రజలు ఉదయం నుండే బావుల వద్ద నీటికోసం పాట్లు పడాల్సి వస్తోంది. ఇప్పుడే ఎండలు ఈ విధంగా దంచికొడుతుంటే మున్ముందు పరిస్థితి ఏలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.