రాష్ట్రీయం

ఒంటిమిట్ట రామయ్యకు మోహినీ అలంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు మోహినీ అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మోహినీ అలంకారంలో ఉన్న స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చిన అనంతరం ఆలయ నాలుగు మాడావీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం ముందుభాగంలో భక్తబృందాల చెక్క్భజనలు, కోలాటాలు, ఆటపాటలతో అలరించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గ్రామోత్సవం ముందుకుసాగగా దారిపొడవునా భక్తులు జయజయధ్వనాలు చేస్తూ జై శ్రీరామ్ అంటూ కర్పూర హారతులు సమర్పించి, టెంకాయలు కొడుతూ మొక్కులు తీర్చుకున్నారు. దేవతలను రాక్షసుల బారినుండి కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు ఎత్తిన మోహినీ అలంకారానికి ఆధ్యాత్మిక ప్రాశస్త్యముంది. మోహినీ అలంకారంతో ఉన్న శ్రీరామచంద్రమూర్తిని చూసి భక్తులు స్వామివారి కరుణాకటాక్షాలకు ప్రాప్తులయ్యారు. గ్రామోత్సవంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి గరుడోత్సవం నిర్వహించారు. అందంగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై ఆశీలనుజేయించి గ్రామోత్సవం నిర్వహించారు.