రాష్ట్రీయం

వేడుకగా శ్రీవారి వసంతోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు బుధవారం వేడుకగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీ మలయప్ప స్వామివారికి ఈ ఉత్సవానికి వసంతోత్సవంగా భావిస్తారు. ఎండవేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఈ ఉత్సవం కనుకనే దీన్ని ఉపశమనోత్సవం అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటుగా పలురకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదించారు. ఈ వేడుకల కోసం వట్టివేరుతో ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. మండపం ఆవరణలో ఏనుగులు, సింహాలు, పులులు, నెమళ్లు, పాములు, వేలాడే కోతులు ఇతర జంతువుల, పలురకాల చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవీ సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు. ఇదిలావుండగా, వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. అనంతరం ఛత్రచామర వ్యజన దర్పణాది నైవేద్యం, ధూపదీప నైవేద్యం సమర్పించారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. ఈసందర్భంగా తైత్తిరీయ ఉపనిషత్తు, పంచ సూక్తాలు, శాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు.
ఈ వేడుకల్లో ఒక్కో క్రతువులో ఒక్కోరకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడ నుంచి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. కాగా వసంతోత్సవాల సందర్భంగా ఈనెల్లో జరిగే పున్నమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది
చిత్రం... తిరుమలలోని వసంత మండపంలో ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామికి
స్నపన తిరుమంజనం చేస్తున్న వేద పండితులు