రాష్ట్రీయం

గల్ఫ్ దేశాల్లో అరిగోస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 18: బతుకు బాట.. ఉపాధి వేటలో.. గల్ఫ్ బాట పట్టిన అనేకమంది భారతీయులు అక్కడ అరిగోస పడుతున్నారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన అనేక మంది గరీబులు అక్కడ ఏదోరకం ఇల్లీగల్ మైగ్రైన్‌గా మారి చిన్న చిన్న తప్పిదాలకే అక్కడి చట్టాలకు శిక్షార్హులై జైళ్లలో మగ్గుతున్నారు. ఈ తరహాలో సౌదీ అరేబియాలో మూడు వేల మంది భారతీయ కార్మికులు జైలుపాలు కాగా, బెహరాన్‌లో వెయ్యి మంది, కువైట్‌లో 1500 మంది, మస్కట్‌లో రెండు వేల మంది, ఖతార్‌లో 1500 మంది, అఫ్ఘనిస్తాన్‌లో వెయ్యి మంది, ఇరాన్‌లో వెయ్యి మంది, మలేషియాలో 1500 మంది, వివిధ రంగాలలో మోసపోయిన భారతీయ కార్మికులు గల్ఫ్‌లో జైలుపాలై నరకయాతన అనుభవిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు, వారికి సహకరిస్తున్న కొందరు రాజకీయ నాయకులు లైసెన్స్ తీసుకున్న ట్రావెల్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా ఉపాధికోసం వీరి వద్దకు వచ్చేవారిని గల్ఫ్ దేశాలకు పంపించేందుకు అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతుండగా అప్పోసప్పో గల్ఫ్‌బాట పడుతూ చేసిన అప్పులు తీర్చి నాలుగు రాళ్లు సంపాదించుకొనేందుకు భారతీయులు అనేక మంది గల్ఫ్‌బాట పడుతూ మరింత గరీబులవుతున్నారు. పొట్ట చేత పట్టుకొని గల్ఫ్‌బాట పట్టిన వారు గల్ఫ్‌లో చేతినిండా పని దొరక్క అప్పు తీర్చే మార్గం కనిపించక, ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక అరిగోస పడుతున్నారు. మరికొందరు ఎలాగోలా బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చని, కలోగంజో కలిసి తాగుదాం, స్వదేశానికి తిరిగి రావాలని, ఉన్న ఊరు, కన్న వారి కోరిక మేరకు తిరిగి వచ్చిన వారు ఏజెంట్ల మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజకీయ నేతల అండదండలు, పోలీసుల సహకారంతో సదరు గల్ఫ్ ఏజెంట్లు, ట్రావెల్స్ ఏజెన్సీల నిర్వాహకులు తప్పించుకు తిరుగుతున్నారు. ఈ తరహాలో ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణానికి జెందిన డొక్కా నాగయ్య , నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడపాకలకు చెందిన పూసల శ్రీనివాస్, కరీంనగర్ సమీపంలోని రాంపూర్‌కు చెందిన నవీన్‌లు గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు గురికాగా, వారిని స్వదేశానికి రప్పించినట్లు గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శేఖ్ చాంద్‌పాషా వెల్లడించారు. పదేళ్ల పాటు జైలుశిక్ష, 50 వేల ధరమ్స్ చెల్లించి ఇటీవల కొందరు బయటపడినట్లు తెలిపారు.1986 ఇమిగ్రేషన్ చట్టంపై పరిపూర్ణఅవగాహన లేక లక్షలాది మంది గల్ఫ్ వెళ్లి మోసపోయి గోసపడుతున్నారు. మోసపోయి గోసపడుతున్న భారతీయులను స్వదేశానికి రప్పించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు ప్రయత్నాలు చేయాల్సిన అవసరముందన్నారు. గల్ఫ్‌లో అరిగోస పడుతున్న అనేక మంది భారతీయులను తాను ఇప్పటివరకు స్వదేశానికి తెప్పించానని, 2006 నుండి నేటి వరకు కన్నవారి కడసారి చూపుకోసం 600 మృతదేహాలను తెప్పించానన్నారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే ముంబాయి, బొగ్గుబాయి, దుబాయి వలసలు ఉండవని, కల్లబొల్లి కబుర్లు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చినా గల్ఫ్ దేశాల్లో తెలంగాణ బిడ్డలు గల్ఫ్‌లో అరిగోస పడుతున్నా పట్టించుకోవాలన్న ధ్యాసే పాలకులకు కరువైందన్నారు. ఆంధ్రాపాలకుల ఆధిపత్యంలో తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని, మాటలతో మభ్యపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించి రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి కొండంత అండగా నిల్చిన తెలంగాణ బిడ్డల వలసలను తెరాస ప్రభుత్వం ఆపిందా? కనీసం బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచిందా? వారి బాధలు, గాధలు తీర్చేదిశగా ఆలోచన రావట్లేదా? ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఉపాధి చూపాలనే చర్యలు చేపట్టకుండా పదవులు, అధికారమే పరమావధిగా ప్రజాసమస్యలను పాతరేసి, అధికారమనే పీఠమెక్కి పేదల బాధలు తీర్చేందుకు పునరాలోచన చేయని పాలకులు ప్రజాప్రతిఘటనను ఎప్పటికైనా ఎదుర్కోక తప్పదని గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్ పాషా హెచ్చరించారు.

చిత్రం..గల్ఫ్‌లో నరకయాతన అనుభవిస్తున్న భారతీయులు