రాష్ట్రీయం

కమీషన్ల కోసం పోలవరంపై రివ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంపై సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం వెనక భారీగా కమిషన్లు దండుకోవడానికేనని వైకాపా సీనియర్ నేత రామచంద్రయ్య ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్ లోటుస్‌పాండ్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగుపోతూ తనకు అనుకూల వర్గాల కోసం చెక్‌లపై సంతకాలు చేయడం ఆర్థిక నేరమేనని ఆయన గుర్తు చేశారు. ఆఘమాగలపై చెక్‌లపై చంద్రబాబు చేస్తున్న సంతకాలు చెల్లని సంతకాలంటూ ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబులో భయాందోళన వ్యక్తం అవుతోందన్నారు. బాబుకు ఓటమి ఒక్కటేకాదు, అవినీతిని తవ్వి తీస్తారనే భయం పట్టకుందన్నారు.
ఏపీలో ఘోరంగా పాలన సాగించిన చంద్రనబాబు ప్రపంచమంతా తిరిగి నీతులు చెప్పడం దేనికని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రైతులకు లాభం కంటే చంద్రబాబుకు నగదు మూటలు భారీగా ముట్టాయన్నారు. చంద్రబాబును ఎవరితో పోల్చినా వారిని అవమానించినట్లేనని అన్నారు. చంద్రబాబు పాలనలో స్పీకర్ స్థానాకి విలులేకుండా చేశారన్నారు. స్పీకర్ పదవికి కోడెల శివప్రసాద్ కళంకం తెచ్చారన్నారు. గత ఐదేళ్ళుగా కోడెల చట్టాన్ని చెరబట్టారని ఆయన నిప్పులు చెరిగారు.