రాష్ట్రీయం

వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 19: తిరుమలలోని శ్రీవారి ఆలయం వెనుకవైపువున్న వసంతోత్సవ మండపంలో గత మూడు రోజులుగా జరుగుతున్న సాలకట్ల వసంతోత్సవాలు శుక్రవారం కన్నులపండుగగా ముగిశాయి. రెండు రోజులపాటు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయదేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా, చివరి రోజైన శుక్రవారం శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ మలయప్పస్వామితోపాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీ రుక్మిణీ సమేత శ్రీ కృష్ణస్వామివారు వసంతోత్సవం సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అత్యంత నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్నజీయర్ స్వామి, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుండగా తిరుమలలో రద్దీ గణనీయంగా పెరిగింది. గుడ్‌ఫ్రైడే, శని, ఆదివారాలతో వరుసగా సెలవులు రావడంతో భక్తులు తిరుమల బాటపట్టారు. దీంతో కొండపై ఎటుచూసినా భక్తుల సందడే కనిపిస్తుంది. దీనికి తోడు పరీక్షలు పూర్తికావడం, ఫలితాలు వెలువడడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సర్వదర్శనానికి 20 గంటలు సమయం పడుతోంది.