రాష్ట్రీయం

32 జడ్పీలు మీవే అయితే.. ముందస్తు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: పరిషత్ ఎన్నికల్లో 32 జిల్లాల జిల్లా పరిషత్‌ల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అంత నమ్మకం ఉంటే పరిషత్ ఎన్నికలపై ఎందుకు ముందస్తుకు వెలుతున్నారంటు మాజీ మంత్రి, బీజేపీ నేత డి.కె.అరుణ నిలదీశారు. శనివారం బీజేపీ నల్లగొండ జిల్లా కౌన్సిల్ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు సీఎం కేసీఆర్ పాలన తీరుపై మరోమారు విరుచుకపడ్డారు. కారు..పదహారు అంటు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వస్తాయని తెలిసే సీఎం కేసీఆర్ పరిషత్ ఎన్నికలను ముందస్తుగా జరిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పరిషత్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మెజార్టీ ఎంపీపీలు, జడ్పీలు సాధించేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని గ్రామస్వరాజ్యం సాధనకు ప్రజలు పరిషత్ ఎన్నికల్లో బీజేపికి మద్ధతుగా నిలువాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగాలంటే, ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని ఆమె ప్రజలను కోరారు. విద్యావంతులు, ఉద్యోగులు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందునే వారిపై కక్ష సాధింపుకు కేసీఆర్ ప్రభుత్వం పూనుకుంటుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులంతా అవినీతిమయమయ్యారంటున్న సీఎం కేసీఆర్ కంటే పెద్ద అవినీతి పరుడు రాష్ట్రంలో ఎవరు లేరన్నట్లుగా భావించాల్సి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అవినీతి రెక్కలు విప్పిన పక్షుల వలే విహారిస్తుందని, ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేస్తు లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న సీఎం కేసీఆర్ అవినీతి సామ్రాట్‌గా కొనసాగుతున్నారని అరుణ దుయ్యబట్టారు.

చిత్రం... నల్లగొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ