రాష్ట్రీయం

రాజ్యాధికారం కోసం ఐక్యంగా ఉందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేట, ఏప్రిల్ 20: రాజ్యాధికారం కోసం కలసిమెలసి ఉండి ఐకమత్యంతో పోరాడి రాజ్యాధికారం సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య బడుగువర్గాలకు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ లోని నారాయణపేట జిల్లా మాదాసి కుర్వ, మాదారి కుర్వ జిల్లా స్థాయి తొలి సమావేశం నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెట్రో గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నీతి, న్యాయం, ధర్మాలకు కురుమలు ప్రతీకలన్నారు. కురుమలకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి ఉందన్నారు. దేవుళ్లలో, రాజరికాల్లో ఎంతో ప్రసిద్ది ఉందన్నారు. నీతివంతమైన పాలన, న్యాయం, ధర్మంతో కూడిన పాలన అందించిన ఘనత కురుమలకే దక్కిందన్నారు. వాస్తవాన్ని గుర్తించి ముందుకు సాగితే రాజ్యాధికారం మీదేనన్నారు. అందుకు చేయాల్సిందల్లా ఐక్యత సాధించడమేనని, ప్రవర్తనలో మార్పురావాలన్నారు. ప్రతి ఒక్కరు తాము దేనిలో తక్కువ కాదన్న విషయాన్ని గురిస్తే వేళ్లమీద ఉండగలిగే అగ్రవర్ణాల రాజ్యం ఊడి రాజ్యాధికారం బడుగుల చేతిలో వచ్చిపడుతుంద్నారు. ముఖ్యంగా బీసీ సంఘం పోరాటం ద్వారానే బడుగులు, కురుమల కుటుంబాలు విద్యనభ్యసిస్తేనే అభివృద్దిలోకి వస్తారన్నారు. ఓటు అంటే తెల్ల కాగితం కాదని, ఓటు వజ్రాయుధమన్నారు. ఓటును నోటుకు అమ్ముకోకుండా గంపగుత్తగా ఏ పార్టీలో ఉన్నా కులం అభివృద్దికి ఓటు వేస్తే రాజ్యాధికారం దక్కుతుందన్నారు. కులానికి ఓటు వేసే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్పోరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కురుమల అభివృద్దికి ఇతోధికంగా కృషి చేస్తున్నారన్నారు. రానున్న పరిషత్ ఎన్నికల్లో మండల, జిల్లా పరిషత్ చైర్మన్ల టికెట్లు అధికంగా కురుమలకు దక్కేలా కృషి చేస్తానన్నారు. ఐకమత్యంతో ఉండి కరుమలు చైతన్యవంతులై సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ది సాధించాలన్నారు. మాదాసి కుర్వ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజిత్‌కుమార్ మాట్లాడుతూ కురుమలు అన్నీ రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారన్నారు. కురుమలు అభివృద్ది చెందాలంటే చట్టసభల్లో స్థానం సంపాదించుకోవాలన్నారు. మాదాసి కుర్వలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఎన్నో పోరాటాలు చేసి జిఓను సాధించుకున్నా నేటికి ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు. చట్టసభల్లో మనగొంతు వినిపించే వారు లేకపోవడం వల్లే ఆ జిఓ మూలన పడిపోయిందన్నారు. నమ హక్కులను రాజ్యాధికారాన్ని సాధించుకునేందుకు కుమలంతా ఐక్యం కావాలని, స్థానిక ఎన్నికల్లో ఐక్యతతో సత్తా చాటుకుందామని సూచించారు.