రాష్ట్రీయం

ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చూపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపాలని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ నేతలతో ఆయన సమీక్ష జరిపి తెలంగాణ జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని సూచించినట్టు జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి ఎన్ శంకర్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులను దించాలని కోరిన మీదట పవన్‌కళ్యాణ్ అందుకు సానుకూలంగా స్పందించారు. 5857 ఎంపీటీసీ, 535 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఉదయం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. జనసేన తెలంగాణ ఇన్‌చార్జి ఎన్ శంకర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు బీ మహేందర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పీ హరిప్రసాద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని అధ్యక్షుడు ఆదేశించారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో జనసేన పోటీ చేసిందని, అయితే స్థానిక ఎన్నికల్లో పోటీ అందుకు భిన్నంగా ఉంటుందని, పార్టీకి యువత, మహిళలు చాలా బలమని అన్నారు. పవన్‌కళ్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ ఏడు సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యమనే భావన వ్యక్తమైందని, వాటిని గ్రామ స్థాయి నుండి అమలుచేసేందుకు స్థానిక ఎన్నికల్లో పోటీచేయాలని, అందుకు అనుగుణంగా పార్టీ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తామని వారు పేర్కొన్నారు.