రాష్ట్రీయం

నేత్రపర్వం.. చక్రస్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 21: కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో 9వ రోజైన (చివరి రోజు) ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పుష్కరిణిలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా సాగింది. చక్రస్నానం క్రతువులో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. చక్రస్నానానికి ముందుగా వేద పండితులు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజామున 4 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన మహోత్సవం నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవమూర్తులను తిరుచ్చిలో, సుదర్శన చక్రతాళ్వార్‌ను పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. 10 నుంచి 11 గంటల వరకూ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలతో భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఆలయ సంప్రదాయాలతో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. కాగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు.
చిత్రం...ఒంటిమిట్ట రామాలయంలోని పుష్కరిణిలో స్వామివారికి చక్రతాళ్వార్లతో చక్రస్నానం చేయిస్తున్న దృశ్యం