రాష్ట్రీయం

గందరగోళంగా ఏపీపీఎస్సీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 21: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో గందరగోళం నెలకొంది. కొన్నిచోట్ల పరీక్షా కేంద్రాలు తప్పుగా ప్రకటించగా, కొన్నిచోట్ల సరైన వసతి సదుపాయం లేక అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖలో పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 60,641 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 36,730 మంది హాజరయ్యారు. అయితే పరీక్షా కేంద్రాల ఏర్పాటు, అభ్యర్థులకు కేటాయింపు వంటి అంశాల్లో పలు తప్పిదాలు అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. జిల్లాలోని కొంతమంది అభ్యర్థులకు తిమ్మాపురం ఆదర్శ జూనియర్ కళాశాలను చిరునామాగా పేర్కొన్నారు. అయితే అభ్యర్థులంతా భీమిలి మండలం బీచ్‌రోడ్డులోని తిమ్మాపురంగా భావించి ఆదర్శ జూనియన్ కళాశాల కోసం అనే్వషణ ప్రారంభించారు. అయితే అభ్యర్థుల హాల్‌టికెట్‌లో పేర్కొన్న తిమ్మాపురం జంక్షన్, ఎస్.రాయవరం మండల పరిధిలో గ్రామం కావడం గమనార్హం. భీమిలి తిమ్మాపురం నుంచి ఎస్.రాయవరం తిమ్మాపురం చేరుకోవాలంటే సుమారు మూడు గంటల ప్రయాణం. దీంతో అభ్యర్థులు తీవ్ర అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులంతా ఆగ్రహంతో కలెక్టర్ బంగ్లాకు చేరుకుని నిరసన తెలిపారు. నిరుద్యోగులైన తమ జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారంటూ మండిపడ్డారు. తిరిగి తమకు పరీక్ష నిర్వహించాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామంటూ భీష్మించి కూర్చున్నారు. అయితే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే పరీక్షలపై తాము ఎటువంటి నిర్ణయం ప్రకటించలేమంటూ అధికారులు చేతులెత్తేశారు. దీంతో అభ్యర్థులు కలెక్టర్ బంగ్లా వద్ద బైఠాయించారు. పరిస్థితులు చేయిదాటి పోకుండా స్థానిక పోలీసులు అధ్యర్థులను తీసుకుపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
చిత్రం... విశాఖ కలెక్టర్ బంగ్లా వద్ద నిరసన తెలుపుతున్న అభ్యర్థులు